Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:44AM

నేవీ ఉద్యోగినని మోసం చేసిన యువకుడి అరెస్టు

అనకాపల్లి టౌన్‌ : నేవీ ఉద్యోగినని పరిచయం పెంచుకోవడమే కాకుండా వారిని మోసం చేసి బంగారం, నగదును అపహరించిన నేరం కింద విజయనగరం రైల్వే క్వార్టర్స్‌కు చెందిన దొడ్డ నాగేంద్ర కనకేశ్వరరావు ఎలియస్‌ నాగేంద్ర (26)ను శుక్రవారం అరెస్టు చేసినట్టు విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ సీఐ జి.చంద్ర చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖరులకు తెలిపిన వివరాల ప్రకారం.
దొడ్డ నాగేంద్ర గతంలో నేవీ కుక్‌గా పనిచేశాడు. తర్వాత సైలర్‌ ఎంపికై అండమాన్‌లో పనిచేశాడు. అక్కడ నుంచి తిరిగి విశాఖపట్నం బదిలీపై వచ్చాడు. అయితే ఆయన పనితీరు సక్రమంగా లేకపోవడంతో అధికారులు నాగేంద్రను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తాను నేవీ కమాండెంట్‌నని, ఉద్యోగాలిప్పిస్తానని అందరిని నమ్మించాడు. స్థానిక నెట్‌ సెంటర్‌ వద్ద నెట్‌ దగ్గరకు వచ్చే యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో ఆగస్టు 2న స్థానిక గుండాల వీధికి చెందిన నెట్టం మధుతో నాగేంద్ర పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్‌ నుంచి డబ్బులు వేయించుకుంటానని మాయమాటలు చెప్పి మధు వద్ద నుంచి ఏటీఎం కార్డు నంబర్‌ తీసుకున్నాడు. ఎకౌంట్‌లో పదివేల రూపాయలు వేసి తిరిగి డ్రా చేశాడు. అదే రోజున తనకు పెళ్లి చూపులని మెడలోని బంగారు గొలుసు, బైకు, ఏటీఎం కార్డు ఇవ్వాలని మధును కోరాడు. దీంతో మధు వీటిని నాగేంద్రకు అందజేశాడు.
కాగా ఏటీఎం కార్డు ద్వారా నాగేంద్ర 35వేల రూపాయలు డ్రా చేసినట్టు గుర్తించిన మధు పెళ్లి చూపులకు వెళ్లి వ్యక్తి వారం గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు.
వాహనాలు తనిఖీ చేస్తుండగా..
శుక్రవారం ఉదయం పూడిమడక రోడ్డులోని బైపాస్‌ జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులు మధు వాహనంపై నాగేంద్ర వస్తుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని రప్రప్రశ్నించారు. దీంతో నాగ్రేంద నేరం అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు నాగేంద్ర నుంచి బంగారం గొలుసు, ద్విచక్ర వాహనం, నేవీ కమాండెంట్‌ ఉన్నగా ఐడీ, ఏటీఎం కార్డు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్రను శుక్రవారం కోర్టుకు తరలించినట్టు సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడ్ని పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ కుమార్‌, కానిస్టేబుళ్లు అర్జున్‌, వాసు, వర్మలను సీఐ అభినందించారు.

లేౖో