Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:44AM

కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య


పూసపాటిరేగ: తిప్పలవలస గ్రామంలో రాయితి లక్ష్మయ్య (50) అనే వ్యకి గురువారం ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా లక్ష్మయ్య కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. నొప్పి తాళలేక తన నివాసంలో ఎవరూలేని సమయంలో ఇం టిపైకప్పుకు తాడుకట్టి ఉరివేసుకొని ఆత్మహ త్య చేసుకొన్నట్లు తెలిపారు. మృతుడికి భార్య అప్పయమ్మతోపాటు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన భార్యతో పాటు చుట్టు పక్కల వారంతా చేపలవేటకు వెళ్లిపోయిన సమయ చూసుకొని లక్ష్మయ్య ఉరివేసుకున్నా డు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని భార్యవచ్చి తలుపులు తెరచి చూడగా ఆత్మహత్య చేసుకొని ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థ లానికి స్థానిక ఎస్‌ఐ ఫ్రకృద్దీన్‌ చేరుకొని దర్యా ప్తు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమో దుచేసి మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.