Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:44AM

నేవల్‌ బేస్‌ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోండి

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి):
రాంబిల్లిలో నిర్మిస్తున్న నేవల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేషన్‌ బేస్‌(ఎన్‌ఏఓబి)నిర్మాణంలో నెలకున్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహసీల్దార్‌ , ప్రాజెక్టు ఎస్డీసీలు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జేసీ శర్మ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎన్‌ యువరాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏజెసీ వై నర్సింహారావు నేవల్‌ అధికారులతో ఆయన సమావేశమై ఎన్‌ఏఓబీ సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమస్యల పట్ల ఉదాసీన వైఖరి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపా లన్నారు. అదేసమయంలో నేవల్‌ బేస్‌ నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు తలెత్త కుండా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన తెలిపారు. నష్ట పరిహారం చెల్లింపు విషయంలో లోకాయుక్తలో పెండింగ్‌ కేసులు సత్వర పరిష్కారానికి చర్యలను చేపట్టాలని ఆయన ఆదేశించారు. అర్హులకు వారికి వెంటనే నష్ట పరిహారాన్ని చెల్లించి వారి జాబితాను లోకాయుక్తకు సమర్పించాలన్నారు. ఎం చింతువ నిర్వాసిత కాలనీలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన చెప్పారు. ఇప్పటికే, వాడనర్సా పురం, కొత్తపట్నం, బంగారమ్మపాలెం గ్రామాలకు చెందిన 407 కుటుంబాలు నిర్వా సితుల కాలనీకి తరలించామని జిల్లా కలెక్టర్‌ ఎన్‌ యువరాజ్‌ తెలపగా, సరిహద్దు గోడకు ఆనుకుని ఉన్న సుమారు 54 కుటుంభాలను కూడా పునరావాస కాలనీకి తరలించాలని ప్రిన్సిపల్‌ కార్యదర్శి శర్శ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వారికి ఇళ్లు కేటాయించడమే కాకుండా ఇంటి నిర్మాణ ఖర్చులను చెల్లించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో దినసరి వేతనంపై స్థానికుల సేవలను వినియోగించుకోవాలని ఆయన నేవల్‌ అధికారులకు సూచించారు.
అనాదీన భూములకు జిరాయితీ భూముల రేటును చెల్లించేందుకు అనమతించాలని ప్రభుత్వాన్ని కోరామని కలెక్టర్‌ ఎన్‌ యువరాజ్‌, ప్రిన్సిపల్‌ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. అదేమాదిరిగా, మత్స్యకారుల సొసైటీ భూములు 381 ఎకరాలకు సంబందించి ప్రభుత్వ భూములకు చెల్లించే రేట్లను నష్ట పరిహారంగా చెల్లించేందుకు అనుమతించాలని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామనారు. ఈ సమావేశంలో ఏజెసీ వై నర్సింహారావు, ఎన్‌ఏఓబీ ఎస్‌డీసీ దయానిధి, అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు, నేవల్‌ అధికారి కెప్టెన్‌ పి బిస్త్‌ పాల్గొన్నారు.
దేవాదాయ భూములు,
భూముల మ్యుటేషన్‌పై చర్చ
జిల్లాలో భూముల రిజిసే్ట్రషన్‌ అనంతరం మ్యుటేషన్‌లో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించేందుకు సూచనలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిఫల్‌ కార్యదర్శి జేసీ శర్మ కోరారు. శుక్రవారం రెండోవిడత సమావేశంలో దేవాదాయ, రిజి సే్ట్రషన్‌ తదుపరి మ్యుటేషన్‌ వంటివాటిపై ఆయన చర్చించారు. రిజిసే్ట్రషన్‌ పూర్తి యిన వెంటనే ఈ సమాచారం తహసీల్దార్‌ కార్యాయానికి చేరడంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. సింహాచలం దేవస్థానం భూములపై కూడా ఆయన చర్చించారు. ఇవేకాకుండా, భూములకు సంబంధించి వివిధ అంశాలు చర్చకు వచ్చాయి.

ౌఛ్ఛ్ఛీలఞలో