Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:43AM

నౌకాదళ ఉద్యోగినని మోసగించిన యువకుడి అరెస్టు


అనకాపల్లి టౌన్‌: నేవీ ఉద్యోగినని పరిచ యం చేసుకొని మోసం చేసి బంగారం, నగదు ను అపహరించిన నేరం కింద విజయనగరం రైల్వే క్వార్టర్స్‌కు చెందిన దొడ్డ నాగేంద్ర కనకేశ్వరరావు ఎలియస్‌ నాగేంద్ర (26)ను శుక్రవా రం అరెస్టు చేసినట్టు విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ సీఐ జి.చంద్ర చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
దొడ్డ నాగేంద్ర గతంలో నేవీ కుక్‌గా పనిచేశాడు. తర్వాత సైలర్‌ ఎంపికై అండమాన్‌లో పనిచేశాడు. అక్కడ నుంచి తిరిగి విశాఖకు బదిలీపై వచ్చాడు. అయితే ఆయన పనితీరు సక్రమంగా లేకపోవడంతో అధికారులు నాగేంద్రను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తాను నేవీ కమాండెంట్‌నని, ఉద్యోగాలిప్పిస్తానని అందరిని నమ్మించాడు. స్థానిక నెట్‌ సెంటర్‌కు వచ్చే యువకులతో పరిచయా లు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడా ది ఆగస్టు 2న స్థానిక గుండాల వీధికి చెందిన నెట్టం మధుతో నాగేంద్ర డీల్‌ కుదుర్చుకున్నాడు. తన ఫ్రెండ్‌ నుంచి డబ్బులు వే యించుకుంటానని మాయమాటలు చెప్పి మధు వద్ద నుంచి ఏటీఎం కార్డు నంబర్‌ తీసుకున్నాడు. అకౌంట్‌లో పదివేల రూపాయలు వేసి తిరిగి డ్రా చేశాడు. అదే రోజున తనకు పెళ్లి చూపులని మెడలోని బంగారు గొలుసు, బైకు, ఏటీఎం కార్డు ఇవ్వాలని మధును కోర డంతో మధు వీటిని నాగేంద్రకు అందజేశాడు.
కాగా ఏటీఎం కార్డు ద్వారా నాగేంద్ర 35 వేల రూపాయలు డ్రా చేసినట్టు గుర్తించిన మధు పెళ్లి చూపులకు వెళ్లి వ్యక్తి వారం గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాలు తనిఖీ చేస్తుండగా..
శుక్రవారం ఉదయం పూడిమడక రోడ్డులోని బైపాస్‌ జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చే స్తుండగా నాగేంద్రను అదుపులోకి తీసుకొన్నా రు. నాగేంద్ర నుంచి బంగారం గొలుసు, ద్విచ క్ర వాహనం, నేవీ కమాండెంట్‌ అని చెప్పుకొని తిరుగుతూ అతని వద్ద ఉన్న ఐడీ, ఏటీఎం కార్డు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్రను శుక్రవారం కోర్టుకు తరలించారు. ఈ కేసులో నిందితుడ్ని పట్టుకునేందు కు కృషి చేసిన ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు, హె డ్‌ కానిస్టేబుల్‌ కుమార్‌, కానిస్టేబుళ్లు అర్జున్‌, వాసు, వర్మలు సీఐ అభినందించారు. ఇౌఠుఽ్ట70ఝల్ఠ9ో