desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:43AM

అక్రమాలకు పాల్పడుతున్న రేషన్‌ డీలర్‌పై విచారణ


బొబ్బిలి రూరల్‌: ఎం.బూర్జవలస రేషన్‌ డీలర్‌ పప్పల అనంతరావుపై గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పౌర సరఫరాల ఉప తహశీల్దార్‌ సీవీ రమణ విచారణ నిర్వహించారు. తప్పుడు తూ నికలు, కొలతలతో వినియోగదారులను మోసగించడమే కాకుండా, గ్రామంలోలేని వారి పేర్లతో రేషన్‌ సరుకులు విడిపించి స్వాహా చేస్తున్నట్లు గ్రామ స ర్పంచ్‌ ఎస్‌.ఈశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ దాసరి పార్వతి, సింగనపల్లి సన్యాసినాయుడు, అల్లు సన్యాసప్పడు, ఇప్పర్తి ఆద మ్మ చనిపోయినప్పటికి వారి పేర సరుకులు విడిపించి స్వాహా చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పెళ్లై వేరే ఊర్లలో ఉన్నవారి పేర్లతో సరుకులు పం పిణీ చేస్తున్నట్టు నమోదు చేస్తున్నారన్నారు. వెంట నే అక్రమాలకు పాల్పడుతున్న డీలర్‌ను తొలగించాలని గ్రామస్థులంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశా రు. గ్రామస్థుల సూచనను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉపతాహశీల్దార్‌ సీవీ రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మావుడి గౌర మ్మ, ఎడ్ల అప్పారావు, కె.చంద్రశేఖర్‌, బి.రామకృష్ణ, బంగారయ్య, నారాయణరావు, చెల్లా సన్యాసిరావు పాల్గొనారు.