Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:41AM

అత్యవసరానికి ‘ప్రఽథమ చికిత్స’

నెల్లూరు - వైద్యం
రాజుపాళెంకు చెందిన రామారావుకు ఇటీవల షుగర్‌ శాతం తక్కువవడంతో కా వలి ఆసుపత్రికి తరలించా రు. అయితే అక్కడ వైద్యులు సీరియస్‌ కండీషన్‌ అంటూ నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లి న బాధితుడి బంధువులు ప్రాణాపాయం తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. మార్గమధ్యంలో తులసి తీర్థం పోద్దామనుకున్నారు. సమయానికి అవి అందుబాటులో లేకపోవడంతో చక్కెర నీళ్లు రోగి గొంతులో పో శారు. కొద్దిసేపటికి షుగర్‌ లెవల్స్‌ య థాస్థితికి చేరి రోగి కోలుకున్నాడు. వెం టనే పరీక్షించిన వైద్యుడు ప్రాణాపాయంలో ప్రాఽథమిక చికిత్సగా ఇచ్చిన చక్కెర నీళ్లు రోగికి మందుగా పని చేశాయని చెప్పడంతో రోగి, బంధువులు సంతోషించారు. ఈ సంఘటన వల్ల ప్రాణాపాయం నుంచి రోగి ఎలా కోలుకున్నారో అర్థ మవుతోంది. రెండు వేల సంవత్సరంలో ప్రపంచ రెడ్‌క్రాస్‌ సంస్థ, రెడ్‌క్రాసెం ట్‌ సొసైటీలు ప్రథమ చికిత్సలపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది సెప్టెంబ రు రెం డో శనివారం ప్రపంచ ఫస్ట్‌ ఎయిడ్‌ డేను నిర్వహించాలని తీర్మా నించింది.
జిల్లాలో అమలు తీరును పరిశీలిస్తే...
రోగికి ప్రథమ చికిత్సలలో అగ్రస్థానం గ్రా మీణ వైద్యులదే. జిల్లావ్యాప్తంగా 700లకు పైగా గ్రామీణ వైద్యులు ఫస్ట్‌ఎయిడ్‌ను అ మలు చేస్తున్నారు. పలు వ్యాధులకు సం బంధించిన వైద్యులకు సిఫార్సు చేస్తున్నా రు. వీరికి వైఎస్సార్‌ ప్రభుత్వంలో ప్రాథమిక వైద్యంపై శిక్షణ కూడా ఇచ్చారు. ఇక రెం డో స్థానంలో 108 అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. మొత్తం జిల్లాలో 30 వా హనాలు ఉండగా రోజంతా ఎక్కడ ఏ ప్ర మాదం జరిగినా అక్కడకు చేరుకుని వాహనంలోనే ప్రఽథమ చికిత్స అందిస్తూ రోగి ప్రాణాలను కాపాడుతున్నాయి.
అవగాహన కల్పించే వారేరి ?
అత్యవసర సమయాల్లో ప్రఽథమ చికిత్సే ప్రాణాధారమవుతుంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ గానీ, స్వచ్ఛంద సంస్థలు కాని ఆ దిశగా ప్రజలలో అవగాహన కల్పించడంలేదు. ప్రత్యేకించి ప్రఽథమ చికిత్సపై ప్రపం చ వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ కృషి చేస్తున్నా జిల్లాలో మాత్రం అలాంటి కార్యక్రమాలు జరగడంలేదు. ప్రధానంగా గుండెపోటు, ఉబ్బ సం, మూర్చ, చిన్నపిల్లల్లో వ్యాధులు, జంతువుల కాట్లు వంటి వాటిపై ప్రథమ చికిత్సకు ఖచ్చితమై న అవగాహన కల్పిస్తే అనేక మంది ప్రాణా లు కాపాడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవగా హన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి.
ప్రఽథమ చికిత్సలు ఇలా !

. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గం ట గోల్డెన్‌ అవర్‌ ఈ గంటలోనే ప్రధమ చికిత్స అందిస్తే వెంటనే ఉపశమనం పొంది ప్రాణాపాయం నుంచి బయటపడుతారు.
. 40 ఏళ్ల పైబడ్డ వాళ్లు గుండెపోటు వ చ్చిన వెంటనే ఉపశమనం పొందేలా నాలుక కింద ఉంచుకుని చప్పరించే కార్భిట్రో ట్‌, డిస్ర్పిన్‌ మాత్రలు అందుబాటులో ఉం చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.
. మధుమేహ వ్యాధి ఉన్న వారు శరీరం లో చక్కెర శాతం తగ్గకుండా చూసుకునేందుకు జేబులో చాక్లెట్స్‌ ఉంచుకోవాలి.
. మూర్చ వ్యాధిగ్రస్తుడు ఎక్కడైనా రోడ్డు మీద పడిపోతే ప్రఽథమ చికిత్సగా ఇనుప వస్తువులు చేతికి ఇవ్వరాదు. గాలి బాగా వీచేలా చూడాలి.
. దుస్తులు వదులుగా ఉండేలా చూడాలి. అనం తరం వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాలి.
. పాముకాటు, కుక్కకాటు, తదితర జంతువులకు సంబంధించి విషం వెంటనే పైకి పాకకుండా బిగుతుగా ఆ ప్రాంతంలో కట్టాలి. దీని వల్ల విష ప్రమాదం నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.
  .ఛాతీనొప్పికి సంబంధించి శ్వాస సరిగా ఆడేలా వెనుకకు తలవంచి నేలపై పండుకునేలా ప్రఽథమ చికిత్సను అం దించాలి. ఛాతీ మధ్యలో రెండు చేతులతో ఒత్తి చికిత్స అందిస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంది.
. చిన్నపిల్లల్లో కడుపునొప్పికి మంచినీరు, పండ్ల రసం తాగిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఆ హారంలో కార్భోనేటెడ్‌ పానీయా లు మానివేస్తే ఇలాంటి నొ ప్పులు చిన్నారుల్లో సంభవించవు.
. ఇలాంటి చిట్కాలు పాటించిన అనంతరం వె ౖద్యుడి వద్ద చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రథమ చికిత్సపై
అవగాహన
అవసరం
ప్రాఽథమిక చికిత్సపై ప్రతి ఒ క్కరికి అవగాహన కల్పించాలి. త ద్వారా ప్రాణాపాయం నుంచి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు విద్యార్థుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌పై చికిత్స అందిస్తే సమాజంలో అనేక ప్రాణాంతక వ్యాధులకు తక్షణం అందించే సహాయం అందు తుంది. దీనిపై ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రత్యేక కృషి చేయాల్సి ఉంది.
- డాక్టర్‌ ఎంవి.రమణయ్య, పీపీసీ వైద్యులు

రెడ్‌క్రాస్‌ ద్వారా ప్రచారం
ఫస్ట్‌ ఎయిడ్‌పై ప్రపంచవ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ సంస్థ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలోనూ దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కార్యక్రమం జిల్లాలో జరగడంలేదు. దీని పై ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ధారించాం. ఆ దిశగా కృషి చేస్తాం. ము ఖ్యంగా గ్రామాల్లో ప్రచారం చేయాల్సి ఉంది.
- డాక్టర్‌ ఈదూరు సుధాకర్‌,
రక్తనిధి కన్వీనర్‌