Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:41AM

ఐక్య పోరాటాలతోనే హక్కుల సాఽధన


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 12: ఐక్య పో రాటాలతో హక్కులు సాధించుకోవాలని ఏఐటీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఉప్పల చంద్రశేఖర్‌ కళ్యాణ మండపంలో పాల ఉత్పత్తిదార్ల సహకార సంఘాల కార్యదర్శులు, వర్కర్స్‌ యూనియన్‌ ఉత్తరాంధ్ర జిల్లాల 27వ మహాసభ జరిగింది. దీనికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కార్యదర్శులంతా ఒక్కరోజు సమ్మె చేస్తే డెయి రీ పరిస్థితి ఏమిటో యాజమాన్యాలు గుర్తెరగాలని అన్నారు. సంఘటితంగా పోరాడి కనీస వేతనాలు సాధించుకోవాలని, ఇందుకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని అన్నారు. 2007లో విడుదలైన జీవో ప్రకారం కార్యదర్శికి రూ.10,500 ఇవ్వాలని, కానీ విశాఖ డెయిరీ యాజమాన్యం ఇవ్వకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్న దని ధ్వజమెత్తారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, గ్రాట్యూటీ కోసం సంఘటిత పోరాటం చేయాలన్నారు. యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విశాఖ డెయిరీ యాజమాన్యం కనీస వేతన చట్టాన్ని అమలు చేసి, చేసి పనికి తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోతే కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడ వద్దని పిలుపునిచ్చారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి రమణయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలి న్‌, అనకాపల్లి కార్యదర్శి వై.ఎన్‌.భద్రం, యూనియన్‌ నాయకులు పి.సత్యనారాయణ, పి.ప్రకా శం, పి.సూర్యనారాయణ, ఆర్‌.సత్యనారాయణ, జి.అచ్యుతరావు(విజయనగరం), ఎం.ప్రసాదరావు(శ్రీకాకుళం), కోన లక్ష్మణ, ఆడారి అప్పా రావు తదితరులు పాల్గొన్నారు. త్చ ్ఙలఏర