Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:41AM

పంచాయతీ భవనాలకు గ్రహణం

మర్రిపాడు: పల్లెపాలనకు గ్రామసచివాలయాలు పట్టుగొమ్మలు. చాలా చోట్ల వీటికి స్వంత భవనాలు లేవు. ఎట్టకేలకు భవనాలకు నిధులు మంజూరైనా సెంటు జాగా సమకూరని దుస్థితి. కొన్ని పంచాయతీల్లో పనులు జరి గినప్పటికీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీం తో పంచాయతీ భవనాలకు గ్రహణం పట్టింది. ఈ దుస్థితి మర్రిపాడు మండలంలో నెలకొంది.
మండలంలో 24 పంచాయతీల్లో 12 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఒక్కొ క్కదానికి రూ.10 లక్షల నిధులను మంజూరు చేసింది. మండల పరిధిలోని సింగనపల్లి, నాగినేనిగుంట, బ్రాహ్మణపల్లి, బూదవాడ, పెగళ్ళపాడు, ఖాదర్‌పూర్‌, ఇర్లపాడు, పల్లవోలు, బీమ వరం, చిలకపాడు, కేతిగుంట, అల్లంపాడు పంచాయతీల్లో భవనాల నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేసింది. ఈ 12 పంచాయతీల్లో నాగినేనిగుంట, సింగనపల్లిలలో మా త్రమే పూర్తయ్యాయి. మిగతా 6 పంచాయతీల్లో నిర్మాణపు పనులు సగంలోనే ఆగిపోగా, పెగళ్ళపాడు, ఖాదర్‌పూర్‌, పల్లవోలు, ఇర్ల పాడు పంచాయతీల్లో అసలు పనులు ప్రారంభానికే నోచుకోలేదు. దీంతో ఎంతమాత్రం భవనాల నిర్మాణాలు సాగుతున్నాయో అర్థమవుతుంది. 2009 సంవత్సరంలో అప్పటి డిజైన్‌ ప్రకారం రూ.10 లక్షలను ఒక్కొక్క భవనానికి కేటాయించారు. ప్రస్తుతం ఆ నిధులకు భవనాన్ని నిర్మించే ప్రసక్తే కనిపించడం లేదు. కారణమేమిటంటే భవనానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇతరత్రా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో భవనాలు నిర్మించడం గగనమైంది.

నిధుల వరకు పూర్తి చేశాం
ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షల నిధులను కేటాయించాం. రెండు పంచాయతీలు మాత్రం పూర్తికాగా మిగిలిన ఎనిమిది పంచాయతీల్లో ఆ నిధుల మేర పనులు పూర్తి చేశాం.
ప్రసాద్‌బాబు,
పంచాయతీరాజ్‌ జేఈ, మర్రిపాడు