Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

ఉపాధి హామీ పథకంలో


ఇద్దరు ఏపీవో, నలుగురు టీఏలపై వేటు
పార్వతీపురం/కురుపాం: జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకంలో కురుపాం మండలంలో ఇద్దరు ఏపీవోలు, నలుగురు సాంకేతిక సహాయకులను డ్వామా పీడీ గో విందరా జులు శనివారం సస్పెండ్‌ చేశారు. ఇటీవ ల కురుపాం మండలంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. చేపట్టిన పనులు, చె ల్లించిన వేతనాలకు సంబంధించి రికార్డులు సామాజిక తనిఖీ సిబ్బందికి ఏపీవోలు, టీఏ లు అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిం చినట్లు సామా జిక తనిఖీ సిబ్బంది డ్వామా ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో పత్రికల్లో కథ నాలు పుంకాను పుంకాలుగా వచ్చాయి. దీని పై జిల్లా కలెక్టర్‌ ఎంఎం నాయక్‌ ప్రత్యేక దృ ష్టి కేంద్రీక రించారు. రికార్డులు నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీవోలు పి.బావా జీ, రెడ్డి సురేష్‌నాయుడులతో పాటు టీఏలు అనంత కుమార్‌, సోమేష్‌కుమార్‌, గంట రామకృష్ణ, రవికిరణ్‌లను కలెక్టర్‌ ఆదేశాల మేరకు డ్వా మా పీడీ సస్పెండ్‌ చేశారు.
ఇదిలా ఉండగా సామాజిక తనిఖీలు జరిగి నప్పుడు మాత్రమే రికార్డులపై అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రికార్డులు నిర్వహణ, వేతనాలు చెల్లింపులు తదితర కార్యక్రమాలను పత్రి నెల ఏపీడీ స్థాయి అధికారి పరిశీ లించవలసి ఉంది. ఆ విధంగా జిల్లాలోని అనే క మండలాల్లో పర్యవేక్షణ, తనిఖీలు నిర్వ హించకపోవడంతో రికార్డులు నిర్వహణ సక్ర మంగా లేదు. ఇదే పరిస్థితి కురుపాం మండ లంలో ఉండడంతో ఒక్కసారిగా కాంట్రాక్టు ప ద్ధతిపై పనిచేస్తున్న ఇద్దరు ఏపీవోలు, నలుగు రు టీఏలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సామా జిక తనిఖీకి సంబంధించి రికార్డులు అప్ప గింత సకాలంలో చేపట్టకపోవడంతో కేవలం ఏపీవోలు, టీఏలు నిర్లక్ష్యమే కారణం కాదన్నది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీడీ స్థాయి అధికారి రికార్డులు నిర్వహణ, వేతనాలు చె ల్లిం పులుపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వ హిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో జిల్లాలోని అనేక మండలాల్లో సామాజిక తనిఖీ సంద ర్భంగా కొన్ని పనులకు సంబం ధించి రికార్డులు అప్పగించని సంఘటనలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో అధికారులు ఇటు వంటి చర్యలు తీసుకోకుండా బదిలీలకే పరి మితమయ్యే వారు.
ప్రస్తుతం జిల్లాలో 12 వే ల ఎకరాల్లో హార్టీ కల్చర్‌ పనులు జరుగుత న్నాయి. ఏజెన్సీ మండలం కురుపాంలో సు మారు మూడు వేల ఎకరాల్లో హార్టీ కల్చర్‌ పనులు చేపడుతున్నారు. అదే విధంగా కొమ రాడ మండలంలో కూడా హార్టీ కల్చర్‌ పను లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కురుపాం మం డలంలో పనిచేసిన ఏపీవో రెడ్డి సురేష్‌ నాయుడు ప్రస్తుతం కొమరాడ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మరొ ఏపీవో పి. బావాజీ కురుపాం మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరి ఏపీవోల తో పాటు నలుగురు టీఏలు సస్పెన్షన్‌ కావ డంతో హార్టీ కల్చర్‌ పనులు వేగవంతంగా జ రుగుతాయో లేదన్నది ప్రస్తుతం మండల వేతనదారుల్లో సందేహం వ్యక్తమవుతుంది.