Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

బాధ్యతగా పని చేయండి

తడ: నెలనెల జీతాలు తీసుకుంటున్నారుగా, బాధ్యతగా పనిచేయండి అని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఉపాధి కూలీలు కూలీ గిట్టడం లేదని రూ.20, 30లు ఇస్తున్నారంటూ వాపోయారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రోజు కూలీ రూ.169లు ఇవ్వాల్సి ఉండగా, ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకంపై వివరాలు తెలపాలని అధికారులను కోరగా 1000 మొక్కల్లో 300 మాత్రమే నాటామని, మిగిలిన 700 మొక్కలు ఎండిపోయాయని తెలిపారు. బాధ్యతారహితంగా పనిచేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. అనంతరం కరిపేటికాలువ చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి అంచనాలు తయారుచేయాలని, కనీస రోడ్లులేని గ్రామాలు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో బ్రహ్మయ్య అధ్యక్షత వహించగా తహసీల్దార్‌ ఏడుకొండలు, మండలాధ్యక్షురాలు చెంగిని సెల్వి రమేష్‌, జడ్పీటీసీ శ్రీధర్‌, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ విద్యుత్‌ ఇరిగేషన్‌ ఏఈలు ఖాజాహుస్సేన్‌, బలరామయ్య, శేఖర్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో దయానందకుమార్‌, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు వేనాటి రాజారెడ్డి, ఏకాంబరం, మురళీరెడ్డి, గుణసుందరి, సుధా, ఉపమండలాధ్యక్షురాలు మండలాధ్యక్షులు రామకృష్ణ, పలువురు ఎంపీటీసీలు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.