Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

కుటుంబంలా పనిచేసి అభివృద్ధి సాధిద్దాం

పెళ్లకూరు: అందరూ కలసి కట్టుగా ఒకే కుటుంబంలా పనిచేసి అభివృద్ధిని సాధిద్దామని తిరుపతి ఎంపీ వర ప్రసాద్‌రావు కోరారు. మండల కేంద్రంని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తాగునీరు, ఆరోగ్యం, విద్య, సంక్షేమశాఖ, వ్యవసాయం, పశువైద్యం, మత్స్యశాఖ, ఉపాధి హామీ, ఇందిరమ్మ గృహాలు, ఇందిర క్రాంతిపథం, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మోడల్‌ పంచాయతీగా చిల్లకూరు
పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామాన్ని మోడల్‌ పంచాయతీగా ఎంపిక చేయనున్నట్లు తిరుపతి ఎంపీ వర ప్రసాద్‌ ప్రకటించారు. ఈ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పంచాయతీ భవనాన్ని మరమ్మతులు చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కంప్యూటరూజ్డ్‌ చేసి ఈ-పంచాయతీ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, సర్పంచ్‌ బసివిరెడ్డి శేషారెడ్డి సొంత నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేకు సన్మానం
మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో ఎంపీ వర ప్రసాద్‌రావు, ఎమ్మెల్యే కిలివేటి, ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిలను సర్పంచు మారాబత్తిన సుధాకర్‌ ఘనంగా సత్కరించారు.
అనంతరం అక్కగారిపేటలో ప్రాథమిక పాఠశాలను ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ. సరళ, జడ్పీటీసీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి వెంకటరావు, ఓడూరు గిరిధర్‌రెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, చిందేపల్లి మధుసూధన్‌రెడ్డి, మారాబత్తిన లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ అద్దంకి మస్తానయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.