Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

కుల ధ్రువీకరణకు కొత్త మెలిక


(జియ్యమ్మవలస)
గిరిజనులకు కుల ధ్రువీకరణ విషయంలో గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ధ్రువీకరించి చెక్‌ లిస్ట్‌ ఇచ్చినా తహశీల్దార్‌ కొత్త మెలిక పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి శ్రద్ధ నకిలీ కుల ధ్రువప త్రాలతో ఉద్యోగం చేస్తున్న వారి విషయంలో చూపించడం లేదు.
గిరిజనుల ఆక్రోశం.
చెక్‌ లిస్ట్‌పై వీఆర్‌వో, ఆర్‌ఐ ధ్రువీకరించి సంతకాలు చేసినా ఆ కుటుంబంలో ఎవరైనా గతంలో చేసుకున్న కుల ధ్రువీకరణ పత్రం గాని, విద్యార్థి అయితే టీసీ గాని విధిగా జత చేస్తేనే కుల ధ్రువపత్రం ఇస్తాం. లేదంటే ఆర్‌ఐ ద్వారా పరిశీలన నివేది వస్తేనే కుల ధ్రువపత్రం ఇస్తాం.
పి.నారాయణరావు, తహశీల్దార్‌.
మండలంలో కుల ధ్రువీకరణ పత్రం పొం దడంలో తహశీల్దార్‌ కొత్త మెలికలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవడం తప్పేటట్టు లేదు. ధ్రువపత్రం పొందాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకొని దానికి ఆ గ్రామంలో ఉంటున్నట్టు ధ్రువీకరించే రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణకు మార్కుల జాబితా లేదా స్టడీ, కాండక్ట్‌ ధ్రువపత్రం జత చేసి దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. తరువాత అతని కుల ధ్రు వీకరణకు వారి చెక్‌ లిస్ట్‌పై ఆ గ్రామానికి సంబంధించిన వీ ఆర్‌వో మండలాల స్థాయిలో ఆర్‌ఐ, డి ప్యూటీ తహశీల్దార్‌, తహశీల్దార్‌ రిక మం డ్‌ చేసి సంతకాలు చేయాల్సి ఉంది. అ యితే మండలంలో ఒక్క తహశీల్దార్‌ త ప్ప మిగిలిన వారందరూ సంతకాలు చేసి తహశీల్దార్‌ వద్దకు పంపించేస్తున్నారు. కానీ తహశీల్దార్‌ పి.నారాయణరావు మా త్రం ఆ దరఖాస్తు, చెక్‌ లిస్ట్‌తో పాటు గతంలో దరఖా స్తుదారుడు కుటుంబ సభ్యులు ఎవరైనా కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే విధిగా జత చేయాలని, లేదంటే దరఖాస్తుదారుడు చదు వుకొని ఉంటే కుల ధ్రువీకరణ చేస్తూ ఆయా పాఠశాల ప్రధానో పాధ్యాయుని సంతకంతో టీ సీ గాని, లేదంటే ఆర్‌ఐ పరిశీలన నివేదిక గాని తప్పక ఉంటేతప్ప ధ్రువపత్రం ఇచ్చేందుకు ని రాకరిస్తు న్నారు. ఈ పద్ధతి రాష్ట్రంలో ఎక్కడా లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఎవరూ చదువుకోకపోయిన వారు ఉం డి, వారెప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తీసు కోపోయి ఉన్నట్లయితే వారి సంగతేంటని కొం దరు తహశీల్దార్‌ను అడిగితే ఆర్‌ఐ ద్వారా వి చారణచేయించి ధ్రువపత్రం ఇస్తామని చె బు తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చే స్తు న్నారు. అలాంటప్పుడు చెక్‌ లిస్ట్‌పై ధ్రు వీక రిస్తూ ఆర్‌ఐ సంతకం చేసి ఇస్తే అది ధ్రు వీకరించినట్టు కాదా? మళ్లీ కొత్తగా విచార ణ నివేదిక ఎందుకని మరికొందరు ప్రశ్ని స్తు న్నారు. తహశీల్దార్‌ నారాయణరావు పెడుతు న్న ఈ కొత్త మెలికతో కాలం దాటిపోయిన కుల ధ్రువీకరణ పత్రాలు 200 వరకు పెండింగ్‌లో ఉన్నట్టు విశ్వ సనీయ సమాచారం. ఇలా అయితే అత్య వసర పరిస్థితుల్లో వారి జీవి తం నాశ నమైపోయినట్లేనని మరికొందరు వా పోతున్నారు. గిరిజనులలో ఒక్క కొండ దొర కుల ధ్రువీకరణ పత్రం ఆర్డీవో ద్వారా ఇస్తూ ఉంటే మిగిలిన అన్ని కులాలకు తహశీల్దార్‌ ద్వారానే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం నకిలీ కుల ధ్రువీకరణ పత్రా లతో ఎందరో ఉద్యోగాలు చేస్తున్నప్పటికి వారి పై అధికారులు గట్టి నిఘా పెట్టడం లేదని, మాలాంటి అమాయక గిరి జనులను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగు ఆదేశాలిచ్చి కుల ధ్రు వీకరణ పత్రాలు త్వరగా వచ్చేటట్టు తహశీల్దార్‌పై చర్యలు తీసుకో వాలని మండల ప్రజలు కోరుతున్నారు.