Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 15:31PM

హర్యానాలో వికటించిన నేత్ర వైద్యం...కంటిచూపు కోల్పోయిన 15 మంది..

అంబాలా (హర్యానా) : హర్యానాలో నేత్ర శస్త్ర చికిత్స వికటించి 15 మంది కంటిచూపు కోల్పోయారు. రోగులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటనపై హర్యానా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హర్యానాలోని అంబాల ప్రాంతంలో సర్వ కల్యాణ్‌ సేవా సమితి నిర్వాకమిది. ఒక నేత్ర వైద్య శిబిరం నిర్వహించి 15 మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేస్తే వారికి కంటి చూపు పోయింది. దాంతో రోగులు, వారి బంధువులు లబోదిబోమన్నారు. రోగులందరినీ ఛండీగఢ్‌లోని పోస్టుగ్రాడ్యూట్‌ వైద్య కళాశాలలో చేర్పించిన సర్వ కల్యాణ్‌ సభ్యులు అక్కడినుంచి పరారయ్యారు.

ఓ బాధితురాలి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ సర్వ కల్యాణ్‌ నేత్ర ఆస్పత్రిలో మా అమ్మకు ఆపరేషన జరిగిందని కట్లు విప్పదీస్తే కళ్లు కనిపించడంలేదని చెప్పింది. ఈ విషయం డాక్టర్‌కు చెబితే సాయంత్రం చూస్తామని అన్నారని...దీంతో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళితే మరోసారి ఆపరేషన చేశారని ఆమె తెలిపింది. అందరి కళ్లల్లో ఇన్ఫెక్షన ఉందని వైద్యులు తెలిపారని ఆమె చెప్పింది.

వైద్య శిబిరాలు నిర్వహించాలంటే జిల్లా వైద్య అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అనుమతులు లేకుండా సర్వ కల్యాణ్‌ సేవా సంస్థ నేత్ర శిబిరాలను నిర్వహిస్తోందని హర్యానా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన హర్యాన... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ కంటిచూపు పోయేందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.