desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

పురపాలికల్లో తాగునీటి పరీక్షలు నిల్‌

మంచినీటి కొళాయిల్లో మురుగు నీరు సరఫరా ఫ పట్టణాల్లో పేరుకే ఇంజనీర్లు
దృష్టి సారించని ప్రజాప్రతినిధులు ఫ వ్యాధుల భయం గుప్పిట్లో ప్రజలు

(ఒంగోలు కార్పొరేషన్‌)
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అనేక విధాల చర్యలు తీ సుకుంటున్నా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. మంచినీరు అందించేందుకు అవస రమైన కిట్‌లను అందించి, ఎప్పటికపుటు తా గునీటి సరఫరా విధానాన్ని పరీక్షించి, ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని ఆదేశి స్తుంది. కోట్లాది రూపాలయ వెచ్చిస్తున్నా కనీ సం శుద్ధి చేసిన నీటి సరఫరా పట్టణ ప్రా ంతాల్లో సాధ్యపడటం లేదు.ప్రధానంగా ఒం గోలు నగరంతోపాటు జిల్లాలోని ఇతర ముని సిపాలిటీలలో రోజువారీ తాగునీటి పరీక్షలు కనిపించడం లేదు. ప్రభుత్వం రూ.లక్షలు వె చ్చించి, అందించిన తాగునీటి పరీక్షా పరికరా లు నిరుపయోగంగా మారాయి. పట్టించుకో వాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నా రు. గురువారం ఒంగోలు నగరంలోని పలుకాలనీల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు సరఫరా జరిగింది. అయినా బాధ్యులైన వారిపై కనీసం శాఖా పరమైన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నారు.
ఎక్కడిక్కడ లీకేజీలు
ప్రధాన మంచినీటి ట్యాంకుల నుంచి పైపులై ను ద్వారా కొళాయిల్లోకి నీరు సరఫరా చేస్తున్న అధికారులు వేళకు నీరు అందించామా ? నిలిి పవేశామా ? అన్న చందంగా వ్యవహరిస్తున్నా రు. కానీ ఎక్కడిక్కడ లీకులు ఏర్పడి తాగునీ రు కలుషితమైపోతోంది. దాని నివారణకు ఫి ట్టర్లు ప్రతి రోజు నీటి సరఫరా చేసేటపుడు ప్ర త్యేక దృష్టి సారించాల్సి ఉండగా ఆలాంటివేమీ కనిపించడం లేదు. ఒంగోలు నగరంలో గత వారం రోజులుగా మంచినీటి కొళాయిల్లో ము రుగునీరు సరఫరా జరుగుతుండగా ఇంజనీర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజ లు మండిపడుతున్నారు. ఉన్నతస్థాయి అధికా రుల పర్యవేక్షణా లోపంతోనే తాగునీటి పరీ క్షలు నిర్వహించకుండా ఫిట్టర్లు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ప్రజలు రోగాల బారిన పడితేనే...
తాగునీటి సరఫరా చేసే ప్రతిసారి నీటి సర ఫరా మొదలయ్యే ప్రాంతం నుంచి చివరి వ రకు నీటి శాంపిల్స్‌ సేకరించాలి. క్లోరినేషన్‌ ఎంత శాతం ఉందో పరిశీలించాలి. దాంతోపా టుగా ప్రతి పదిహేను రోజులకొకసారి మంచి నీటి ట్యాంకులను శుభ్రపరిచి, తేదీలను బోర్డు పై రాయాలి. అంతే కాకుండా వారినికో, పది హేనురోజులకొకసారి భూగర్బజల అధికారులు పరీక్షలు చేయాలి, నీటి రంగు, పీహెచ్‌.విలువ, ఫ్లోరైడ్‌, ఆల్కాహాలు శాతం పరీక్షించి, నీటిశు ద్ధిపై నివేదిక ఇవ్వాలి. కానీ ఆ దిశగా చర్యలు చేపడుతున్న మునిసిపాలిటీలు ఒక్కటీ లేవనే చెప్పాలి. ఎప్పుడైనా ఏదో ఒక ప్రాంతంలోని ప్ర జలు రోగాల బారిన పడినపుడు మాత్రమే స్ప ందించి, ఆఘమేఘాలపై తాగునీటి పరీక్షలపైదృష్టి సారించడం లేదు. పైపులైను లీకులు తరుచుగా తలెత్తడంతో తద్వారా వచ్చే నీరు కలుషితమైపోతుంది.
ఆందోళన చెందుతున్న ప్రజలు
తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సర ఫరా విధానం కొంత మెరుగ్గా ఉండాల్సి ఉం డగా, అందుకు విరుద్ధంగా గ్రామీణ నీటి సర ఫరా విధానం కంటే అధ్వానంగా ఉంది. ఒక వైపు సాగర్‌ జలాల రాకతో చెరువులు, కుంట లు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు నీరు చేరుతో ంది. మరోవైపు ఇపుడిప్పుడే వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొత్తగా చేరిన నీరును కనీస క్లోరినేషన్‌ చేయకపోవడం, అం తేకాకుండా ఫిల్టర్‌ బెడ్‌లో క్లోరినేషన్‌ జరిగినా, మార్గ మధ్యంలో లీకులు కారణంగా మురు గునీరు చేరయడంతో కొళాయిలకు చేరే సరికి దుర్వాసనతో మురుగునీరు విడుదలవుతున్నది. దీంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు సంబం ధిత మునిసిపల్‌ కమిషనర్లుకు, ఇంజనీర్లుకు వివరించినా తమగోడు పట్టించుకోవడం లేదనీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రతి ఆరు నెల ల కొకసారి ముక్కుపిండీ మరీ పన్ను వసూ లు చేస్తున్న అధికారులు మురుగునీటికి పన్ను లు వసూలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇ ప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.