desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:39AM

మోస్తరు వర్షానికే రోడ్లు మునక


(ఒంగోలు కార్పొరేషన్‌)
ఒంగోలు నగరంలో శుక్రవారం కురిసిన ఓ మోస్తరు వర్షానికే రహదారులన్నీ అస్తవ్యస్తం గా మారాయి. ప్రధానరోడ్లలో బురదనీరు పే రుకుపోయి వరదను తలపించే విధంగా ఉ న్నాయి. ప్రధానంగా తూర్పు కమ్మపాలెం సెం టర్‌, పీవీఆర్‌ బాలుర పాఠశాల సమీపంలో నాలుగు రోడ్‌ల కూడలి, పాతమార్కెట్‌ సెంట ర్‌, నెల్లూరు బస్టాండ్‌సెంటర్‌, భాగ్యనగర్‌ 3వ లైను ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యా యి. దీంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. దీనికి తోడు ఆయా వ్యాపార సముదాయల ముందు వాహనాల పార్కింగ్‌ కోసం, ఫుట్‌పాత్‌ వ్యాపా రాల కోసం కాలువల పైకప్పు మూసివేయ డంతో కనీస పారిశుధ్యం, పూడిక తీత పనులు కూడా జరగడం లేదు. కాలువల్లో ఏదైనా వ్యర్ధ పదార్ధాలు అడ్డుపడి మురుగు రోడ్లపైకి చేరిన ప్పుడు మొక్కుబడి చర్యగా పనులు నిర్వహి ంచి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నగరంలో డ్రైనేజి వ్యవస్థ మెరుగప డలేదు. ప్రతి ఏడాది ఓపెన్‌ డ్రెయిన్‌ల నిర్మాణ కోసం రూ.30-40లక్షల వరకు ఖర్చు చేస్తున్న అధికారులు శాశ్వత పరిష్కారదిశగా ప్రతిపాద నలు చేపట్టడంలో విఫలమౌతున్నారు. ఇప్ప టికే చెత్త సమస్య తీరే మార్గం కనిపించకపో గా, వర్షాకాలం కావడంతో మురుగునీరు స మస్యను అధిగమించేందుకు ముందస్తు చర్య లు లేవు. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతంలో పూ డికతీత పనులతో కాలం గడి పేస్తుస్తున్న అ ధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.