Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:39AM

‘బ్లడ్‌ బకెట్‌’ ప్రారంభం

నెల్లూరు (సాంస్కృతికం) : ‘ప్రాణం కోసం రక్తదానం’ పిలుపు మేరకు శుక్రవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బకెట్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు అంతర్జాలంలో వినోదం కోసం ఐస్‌ బకెట్‌, ఆకలి తీర్చేందుకు (ఆహారంకోసం) రైస్‌ బకెట్‌లు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఒక రక్తదానం ద్వారా ముగ్గురికి ప్రాణదానం చేసే శక్తి రక్తదాతకు ఉంది. రక్తదాతల్లో ఉత్సాహం నింపేందుకు బ్లడ్‌ బకెట్‌ను ప్రారంభిస్తున్నట్లు రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఈదూరు సుధాకర్‌ తెలిపారు. చందనా, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ అఽధినేతల్లో ఒకరైన దివంగత మావూరి సత్యనారాయణ (బాబా) 67వ జయంతి సందర్భంగా సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ సిబ్బంది నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్లడ్‌ బకెట్‌ను ప్రప్రథమంగా తమ శిబిరంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం ఆర్‌ షాపింగ్‌ మాల్‌ అధినేత మావూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో షాపింగ్‌ మాల్‌ సిబ్బంది రక్తదానం చేశారు. సీఎంఆర్‌ చందనాబ్రదర్స్‌ వ్యాపారంతోపాటు ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలలో రక్తదానం ఒకటని రాజీ యాడ్స్‌ అధినేత పెంచలయ్య తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ వైద్యుడు డాక్టరు సాయినాధ్‌, మోటివేటర్‌ బి.భాస్కర్‌రావు, షాపింగ్‌మాల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.