desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:39AM

టీఆర్‌ఆర్‌లో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

కందుకూరు: స్థానిక టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు శుక్రవారం ఆహ్లాద కర వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌కె జుబేర్‌ మాట్లాడుతూ బట్టీ చదు వులు వద్దని, అవగాహనతో కూడిన చదువు జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేం దుకు దోహదకారి అవుతుందని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంభాషణ ధోరణిలో విద్యాబోధన, అభ్యా సం జరగాలని ఆకాంక్షించారు. విద్యార్థి క్రమశిక్షణ ఏ పాటితో ఆ విద్యార్థి హాజరు శాతమే కొలమానంగా చెబుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ కళాశాలకు గైర్హాజరు కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఆశ యాలను నెరవేర్చాలని సూచించారు. సమయపాలన ఎంతో అవసరమని కేవ లం విద్యార్థి దశలోనే గాక జీవితాంతం సమయపాలన ఉన్న వ్యక్తులే ఉన్నత శిఖరాలకు చేరగలుగుతారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళా శాల అధ్యాపకులు రామారావు, బ్రహ్మ య్య, రషీద్‌, కాశీరత్నం, వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకర్‌, భాస్కర్‌, రాము, శైలజా కుమారి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నా రు.