Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 11:37AM

పదవులు ఆశించి టీడీపీలో చేరలేదు : ఆనం రామనారాయణ

విజయవాడ : పదవులు, హోదాలు ఆశించి టీడీపీలో చేరలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆనం సోదరులు టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలే తమను టీడీపీలో చేరాలని కోరారన్నారు. రేపటి తరానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.
 
కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని... ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని విమర్శించారు. విభజన సమస్యలను ఆనాడు కాంగ్రెస్ పెద్దలకు చెప్పాం అయినా తమ మాటలను పట్టించుకోలేదన్నారు. విభజన వల్ల ఏపీకి రాజధాని కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. ఓడిపోతామని తెలిసినా పార్టీ పరువు కోసం పోటీ చేశామని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆనం రామనారాయణ‌రెడ్డి పేర్కొన్నారు.
 
రాజకీయం అంటే పదవులు కాదని, ప్రజల అవసరానలు చైతన్యాన్ని బట్టి రాజకీయాలు మారతాయని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ రాష్ట్ర శ్రేయస్సు కోరితే సోనియా రాజకీయంగా ఆలోచించారన్నారు. వైసీపీలో చేరడమంటే రౌడీలతో కలవడమే అని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరతారని చెప్పారు. వైఎస్ కుమారుడినని చెప్పుకునే నైతిక అర్హత జగన్‌కు లేదన్న వివేకా వైఎస్ పేరు జగన్ చెడగొట్టారని ధ్వజమెత్తారు.