Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 11:34AM

‘ప్రాణాహిత’ నవ్వింది

  • ‘ప్రాణహిత- చేవెళ్ల’ ప్యాకేజీలకు ఎట్టకేలకు మోక్షం
  • పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
  • ఇప్పటికీ 40శాతం మేర పూర్తయిన నిర్మాణం
  • పనులు వేగవంతమైతే.. తీరనున్న నీటి సమస్య!
  • సహకరిస్తామన్న మాజీ మంత్రి సుదర్శనరెడ్డి

ఇన్నాళ్లు పనులు ముందుకు సాగక బోసిపోయిన ‘ప్రాణహిత - చేవెళ్ల’ ఎట్టకేలకు నవ్వింది..! ప్రాజెక్టు 20, 21 ప్యాకేజీ పనులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. ఈ మేరకు కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలను సైతం జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ప్రాణహిత’ పనులు కొన్ని రోజులు జరిగాయి. అనంతరం ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా ఈ పనులను నిలిపివేయాలని సర్కారు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘ప్రాణహిత’ పనులు మళ్లీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల 20, 21 ప్యాకేజీ పనులకు ఆమోదం తెలిపింది. పను లు చేపట్టాలని కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలను ఇచ్చారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యే విధంగా చూడాలని కోరినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులు కొన్ని రోజులు జరిగాయి. ప్రాజెక్టుల రీ డిజైన్‌ లో భాగంగా ఈ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇ చ్చింది. బిల్లులు విడుదల చేయకపోవడంతో ఎనిమిది నెలలుగా పనులను కాంట్రాక్టర్లు ని లిపివేశారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఉద్యో గులు, కూలీలను, యంత్రాలను ఇతర ప్రాం తాలకు తరలించారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ పై ఆధారపడి, ప్రాణహిత-చేవెళ్ల ప్రధాన ప్రా జెక్టుపై ఎలాంటి సంబంధం లేకుండా ఈ ప్యాకేజీ పనులను చేపట్టారు. జిల్లాలోని 3.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్యాకే జీ పనులకు శంకుస్థాపన చేశారు.
 
అప్పటి నుంచి పనులు కొనసాగాయి. దాదాపు ఈ రెండు ప్యాకేజీల్లో సుమారు 15 కిలో మీటర్ల మేర సొరంగమార్గం పనులు పూర్తయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ ఆదేశంతో పనులను నిలిపివేయడంతో కాంగ్రెస్‌, టీడీపీ ఆధ్వర్యంలో ఆం దోళనలు నిర్వహించారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల చేపట్టే బినోల నుం చి నవీపేట వరకు పాదయాత్ర చేశారు. ప్ర భుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ పాదయాత్ర లో ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షు డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్య క్షుడు మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నిజామాబా ద్‌ మండలంలో సైతం పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండ లి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ తోపాటు ఇతర నేత లు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును నిరసించా రు. వీరితో పాటు టీడీపీ నేతలు సైతం ప్రాజెక్టుబాట పట్టారు. టీడీపీ నేతలు అరికెల నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజల నుంచి సైతం తీవ్ర నిరసనలు రావడ ంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టి ంది. ఈ మధ్యనే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎంపీలు కవిత, బీబీ పా టిల్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్యాకేజీ పనులు చేపట్టాలని సీఎం దృష్టికి తీ సుకెళ్లారు. వారి నుంచి వివరాలు సేకరించిన సీఎం ఈ పనులను చేపట్టాలని కోరినట్లు తె లిసింది. చివరకు సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు సూచనలతో నీటిపారుదల శాఖ అధికారులకు ఈ ఆదేశాలు ఇచ్చారు.
 
40 శాతం వరకు పనులు పూర్తి..
ప్రాణహిత-చేవెళ్ల జిల్లాలోని మెట్ట ప్రాంత రైతుల కలల ప్రాజెక్టు. జిల్లాలో 20,21,22 ప్యా కేజీలకు అనుమతి ఇచ్చారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిఽదిలోని 19 మండలాలు 134 గ్రామాల్లో 3,04,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఈ మూ డు ప్యాకేజీ పనులకు 3,483 కోట్లతో పరిపాల న అనుమతి ఇచ్చారు. జూన్‌ 2019లోపు పనులు పూర్తిచేయాలని కోరారు. అప్పటి ప్ర భుత్వం 20 ప్యాకేజీ పనులకు 829.67 కోట్లతో అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కాం ట్రాక్టరు 298.306 కోట్ల పనులను పూర్తిచేశా రు. వీటిలో అప్రోచ్‌ కాలువల పనులు పూర్తయ్యాయి. సొరంగం తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో చేపట్టిన 21వ ప్యా కేజీ పనులను 1143.78 కోట్లతో ప్రభుత్వం అ నుమతి ఇచ్చింది. ఈ కాంట్రాక్టరు సుమారు 224.126 కోట్ల పనులను పూర్తిచేశారు. అప్రో చ్‌ కాలువల నిర్మాణం పూర్తయింది. సొరం గం పనులు కొనసాగుతున్నాయి.
 
కొండెం చెరువు పనులు కొంతమేర నడిచాయి. జిల్లాలోని 22వ ప్యాకేజీ పనులకు 1446.48 కోట్ల తో పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ ప్యాకేజీ పనులు మాత్రం 182.635 కోట్ల మేర కే జరిగాయి. చెరువు, కాలువ పనులు జరుగుతున్నవి. జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామం సమీపంలోని ఎస్సారెస్పీ బ్యా క్‌వాటర్‌ గోదావరి నుంచి నీటిని తీసుకునేందుకు కాలువలను తవ్వారు. అక్కడి నుంచి పొతంగల్‌ వరకు సొరంగం ద్వారా తీసుకువస్తారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రధాన ప్రాజెక్టు తో సంబంధం లేని ఈ ప్రాజెక్టు పనులు పూ ర్తయితే జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది. ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నుంచి ఇక్కడ వా డే 28 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ కింద భా గంలోని ఎల్‌ఎండి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజె క్టుకు తరలిస్తారు. ఎస్సారెస్పీ నీటిని జిల్లాలో ని ఈ ప్యాకేజీలకు ఉపయోగిస్తారు. ఇప్పటికే సుమారు 705.67 కోట్ల రూపాయలను ఈ ప్యాకేజీ పనులకు వెచ్చించారు. సొరంగాలను తవ్వారు. ప్యాకేజీ పనులు పూర్తిచేస్తే మాత్రం నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అంద నుంది. నిజామాబాద్‌కు తాగునీరు అందే పరిస్థితి ఉంది.
 
రైతులకు మేలు జరుగుతుంది: మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా రై తులకు మేలు జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పనులను ప రిశీలించి కాంట్రాక్టర్లకు సూచనలు ఇస్తే త్వర గా పూర్తవుతాయి. జిల్లాకు మేలు జరిగే ఈ ప్రాజెక్టుకు నేను భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ నిధులు విడుదల చేశాను. ఈ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తయ్యేందుకు తమ పార్టీ తరపున అన్ని విధాలా సహకరిస్తాం.