Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:39AM

భవిష్యత్‌ తరాలకు మొక్కలు జీవాధారం


కనిగిరి: వాతావరణంలో పెను మార్పులు స్ధభంవించడం వల్ల పర్యావరణం దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడుౄతున్నాయని,ౄభవిష్యత్‌ తరాలకు మొక్కలు జీవనాధారమని ఎమ్మెల్యే కదిరి బాబూౄరావు అన్నారు. శుక్రవారం పట్టౄణంలోని జవౄహర్‌లాల్‌ వీధిలో నీరు-చెట్టు పధకం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కదిరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నీరు-చెట్టు పధకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. కేవలం మొక్కలు నాడటంతో సరిపెట్టకుండా మొక్కలను సంరక్షించాలని అన్నారు. మొక్కలను నాటడానికి అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. విస్తారంగా మొక్కలు నాటాలని ఇందులో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
- తాగునీటి సమస్య పరిష్కరిస్తా
పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బోర్లు నీరు అడుగంటిందని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీధిలోని బోర్లు అధిక శాతం ఎండిపోయాయని నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని విన్నవించగా ఎమ్మెల్యే కదిరి బాబూరావు రెండు బోర్లను మంజూరు చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్ల నిర్మాణం పని వెంటనే ప్రారంభించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.
పట్టణంలో తాగునీటి సమస్యపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని నిధులు ఎంతైనా వెచ్చించి నీటి సమస్య తక్షణ పరిష్కారం చేస్తానన్నారు. మున్సిపల్‌ అధికారులు తాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ షేక్‌ చినమస్తాన్‌, చిరంజీవి,కదిరి శ్రీను, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు,కౌన్సిలర్లు రాచమల్ల శ్రీను,చింతం శ్రీను,బొగ్గవరపు సద్గురు, మాకినేని సాయిరాం, బి.పుల్లారెడ్డి, సత్యంరెడి,్డ ము న్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.