Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 06:59AM

ఓట్లపై నిర్ణయం తీసుకునే వరకు జాబితా ఖరారు చేయొద్దు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలోని 6.3 లక్షల ఓటర్ల తొలగింపుపై నిర్ణయం తీసుకునేంత వరకు ఓటర్ల జాబితాను ఖరారు చేయకుండా ఉండేలా ప్రభుత్వం, జీహెచఎంసీ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన దాఖలైంది. గ్రేటర్‌ హైదరా బాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఓబీసీ సెల్‌ చైౖర్మన ఎం.నగేష్‌ముదిరాజ్‌ హైకోర్టులో ఈ మేరకు పిటిషన దాఖలు చేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ.నాగార్జునరెడ్డి మం గళవారం పిటిషనపై విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించామని, అంతిమంగా 6.3లక్షలు చేర్చాలని నిర్ణయం తీసుకుంటే... వార్డుల రిజర్వేషన్ల ఖరారులో మార్పులు చోటు చేసుకుంటాయని పిటిషనర్‌ తరపున జంధ్యాల రవిశంకర్‌ కోర్టుకు విన్నవించారు. పిటిషనర్‌ తరపు వాదనల్ని పరిగణలోకి తీసు కున్న న్యాయమూర్తి కేంద్ర ఎన్నికల సంఘా నికి ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు పూర్తి అధికారాలుంటాయన్నారు. ఇదే అం శంపై దాఖలైన వ్యాజ్యం బుధవారం మరో సారి విచారణకు రానున్నందున ప్రస్తుత పిటిషనని కూడా వాటితో జతచేయాలన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషనకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ పిటిషనర్‌ మరో అనుబంధ పిటిషన దాఖలు చేశారు.