Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 03:01AM

లౌకికవాదం, అసహనాల అర్థాలు మార్తున్నారు : గల్లా జయదేవ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొంత మంది రాజకీయ అవసరాల కోసం సమా జాన్ని విభజిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సూచించారు. మంగళవారం ఆయన ‘అసహనం’పై లోక్‌సభలో మాట్లాడారు. లౌకికవాదం, అసహనం పదాలను దుర్వినియోగం చేస్తూ వాటి అర్థాలను మారుస్తున్నారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలకు అడ్డుకట్ట వేయకపోతే యుద్ధాలు వస్తాయని హెచ్చరించారు. దేశంలో 72 ఇస్లాం వర్గాలు ఉన్నాయని, మరే ఇతర దేశాల్లో అన్ని వర్గాలు లేవని తెలిపారు. ఇటీవల జరిగిన దాద్రీ, కల్బుర్గి, దబోల్కర్‌ హత్య ఘటనలను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు రాష్ర్టాలకు సంబంధించిన అంశమని తెలిపారు. బలహీలవర్గాలు, అవినీతి, పేదరికం, మహిళలపై దాడులు, రైతుల కష్టాలు, ప్రాంతీయ వివక్షలపై అసహనం వ్యక్తం చేయాలని సూచించారు. కాగా, పార్లమెంటు కార్యకలాపాలను స్థానిక భాషల్లో అనువదించాలని కోరారు.