Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 02:56AM

అమాత్యుల ఆదర్శం

సొంత ఖర్చులతో సమావేశాలకు.. భేటీల్లో.. భోజన ఏర్పాట్లు వారివే
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
యనమల రామకృష్ణుడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి. శాఖ వ్యవహారాల్లోనే కాదు, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ‘ఖజానా’ను ఆయన కాపాడుతున్నారు. సొంత ఖర్చులతో సమావేశాలకు వచ్చి తన వంతుగా కొంత భారం తగ్గిస్తున్నారు.
అచ్చెన్నాయుడు. కార్మిక శాఖ మంత్రి. శ్రమజీవుల సంక్షేమం చూడటం ఆయన విధి. వారికోసం ప్రభుత్వ నిధిని పెంచుతూ, తన అవసరాలను మాత్రం స్వయంగా తీర్చుకొంటున్నారు. అధికార భేటీలకు వచ్చినప్పుడు కూడా, తన ఖర్చులతోనే వసతి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

 
              పరిటాల సునీత పౌర సరఫరాల శాఖ మంత్రి. తెల్లారి లేస్తే పేదోడి కడుపు నింపడంపైనే చూపు నిలిపే శాఖను నడుపుతున్నారు. దానికి తగినట్టే నడుచుకొంటున్నారు. సీఎం నిర్వహించే మీటింగులకు వచ్చినప్పుడు తన భోజన ఏర్పాట్లు తానే చూసుకొంటున్నారు..సొంత రాజధాని లేని నవ్యాంధ్రను తీర్చిదిద్దే బాధ్యత గల వారుగా ఈ ముగ్గురు మంత్రులు ఆదర్శంగా నడచుకొంటున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగే మంత్రివర్గ సమావేశాలకు, జిల్లా కలెక్టర్ల భేటీలకు వారి జిల్లాల నుంచి సొంత ప్రయాణ ఖర్చులతో వచ్చి, వ్యక్తిగతంగా వసతి, భోజన ఏర్పాట్లు చేసుకొంటున్నారు. నిజానికి, కేబినెట్‌ భేటీకి వచ్చే వుంత్రుల ఖర్చులన్నీ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రభుత్వమేు భరిస్తుంది. అయిుుతే, వీరు అధికార యుంత్రాంగాన్ని వారించి సొంత ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇక స్థానికంగా ఉండే మత్రులు దేవినేని ఉవు, కొల్లురవీంద్ర, కామినేని శ్రీనివాస్‌యతదితరులకు కూడ ఎటువంటి ఏర్పాట్లు చేయువలసిన అవసరం ఉండడం లేదు. ఎటొచ్చీ కొందరు మత్రులకు వూత్రం ఇక్కడ వసతులు కల్పించడానికి భారీ వ్యయుం అవుతున్నట్లు తెలుస్తున్నది. విజయాడలో హోటల్‌లో ిసంగిల్‌ పర్సనకు రోజుకు రూ.3500 అవుతుంది. అరుుతే, కొందరు మంత్రులు సిగిల్‌ రూమ్ కాకుండా సూట్‌ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. సూట్‌ అంటే రోజుకు ఎనిమిది వేలు చెల్లించాల్సి ఉంటోందని అదికార వర్గాలు చెబుతున్నాయి