Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

‘గీత’కు పదవి


(విజయనగరం, ఆంధ్రజ్యోతి)
అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తప ల్లి గీతకు కేంద్రంలో కీలకమైన పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోం ది. జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా గీతను కేంద్రం నియమించనుందని ఆమె సన్నిహి తులంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, నియామకం లాంఛనప్రా యమేనని చెబుతున్నారు. విద్యాధికురాలైన ఎంపీ గీత.. వైసీపీ తరపున గత ఎన్నికల్లో గెలుపొం దినప్పటికీ ఆ పార్టీలో తనకు ఎదురవుతున్న అగౌ రవం, ఎదురవుతున్న అవమానాల నేపఽథ్యంలో ఇటీవల పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయం లో టీడీపీ, బీజేపీలకు దగ్గరగా మసలుతున్నారు. పలు సందర్భాల్లో వైసీపీ అధిష్ఠానంపై విమర్శనాసా్త్ర లు సంధించారు. ఎంపీ గీతకు కేంద్రంలో పదవి దక్కేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫా ర్సు చేశారని తెలిసింది. ఆఖరి నిమిషంలో మార్పు లు జరిగితే తప్ప ఆమెకు కేంద్రంలో పదవి దాదాపు గా ఖాయమని భావిస్తున్నారు