Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి


ఒంగోలు కలెక్టరేట్‌: ఓటర్ల జాబి తా, చేర్పులు మార్పులపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (సమ్మర్‌ రివిజన్‌) జరుగుతుండటం తో ఎన్నికల కమిషన్‌ పలు ఆదేశా లను జారీ చేసింది. నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసు కోవాలని ఆదేశించడంతో పాటు డూ ప్లికేట్‌ ఓట్లపై కూడా ప్రత్యేక ఆదే శాలు జారీ చేసింది. ఒక వ్యక్తికి రెం డుచోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగిం చడంతో పాటు ఆర్హత ఉన్న వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించే విధం గా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల సమ యంలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే వాటినిపరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసు కోవాలని సూచించింది. మరోవైపు ఓటర్ల జాబితాలో గతంలో సీ్త్రలింగం, పురుషలింగంతో పాటు ఇతరులు అ నే కాలం ఉండేది. ఆయితే ఈపర్యా యం ఓటర్ల జాబితాలో స్వల్ప మా ర్పులు చేస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదే శాలు జారీచేసింది. గతంలో ఓటర్ల జాబితాలో ఇతరులు అని ఉన్న కాలా న్ని తొలగించి ఆ స్థానంలో తృతీయ ప్రకృతి(మూడో కేటగిరి జనరల్‌) అనే రాసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయాన్ని అధికా రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను జి ల్లా స్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అందుకు అను గుణంగా జిల్లా అధికారులు ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారులకు పలు సూచనలు ఇస్తూ అదేశాలు జారీచేసింది.