Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

జిల్లా మేధావుల సంఘంచే ఘనంగా సన్మానం

కడప జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు వివేకానందరెడ్డి నేతృత్వంలో పుష్పగిరి పాఠశాల ఆవరణలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానందరెడ్డితో పాటు వైవీయూ ప్రొఫెసర్‌ గోవర్థన్‌నాయుడు, డాక్టర్‌ రామ్‌మనోహర్‌, బి.ఎడ్‌ కళాశాలల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులగౌడ్‌లు ప్రసంగిస్తూ జిల్లాలో అభివృద్ధి జరిగేందుకు అన్ని వసతులు ఉన్నాయని, జిల్లా గురించి పూర్తి అవగాహన ఉన్న సతీష్‌రెడ్డి మరింత కృషి చేయాలని కోరారు. సతీష్‌రెడ్డి స్పందిస్తూ మీరిచ్చిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను విద్యార్థులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రముఖులు సన్మానించారు.