Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

సేవా దృక్పథంతో విద్యాసంస్థల ఏర్పాటు

మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు
ఎస్‌ఎస్‌ఎన్‌ అధినేత రామకృష్ణారెడ్డి

ఒంగోలు కలెక్టరేట్‌: సేవా దృక్ప థంతోనే విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తు న్నట్లు ఎస్‌ఎస్‌ఎన్‌ విద్యా సంస్థల అధినేత యల్లటూరి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక మంగమూరు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ డిగ్రీ కాలేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ కళాశాల అవార్డును ఎస్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాల అందు కుందని తెలిపారు. నాగార్జున విశ్వ విద్యాలయ 38వ వ్యవస్థాపక దినోత్స వాన్ని పురష్కరించుకొని బెస్ట్‌ పెర్పార్మె న్స్‌ ప్రథమ బహుమతిని వైస్‌ చాన్స లర్‌ కె.వియన్నారావు, రిక్టార్‌ రామసు బ్బయ్యల చేతుల మీదుగా అందుకు న్నట్లు వివరించారు. సేవాదృక్పథంతో 1987లో విద్యారంగంలో ఆడుగుపెట్టి అంచెలంచెలుగా జూనియర్‌ కళాశాల స్థాయి నుంచి ఉన్నత, అత్యున్నత సాంకేతిక విద్య స్థాయి వరకు అభివృ ద్ధి చేశామన్నారు. త్వరలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కూడా సన్నాహా లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల 1994లో స్థాపించిన నాటి నుంచి 2014 వరకు ప్రైవేటు విద్యా రంగంలో సైతం ఉన్నత ప్రమాణాలు, క్రమశిక్షణలతో కూడిన విద్యను అంది స్తున్నట్లు తెలిపారు. ఈ కృషిలో భాగంగానే ఏడవ సారి ఉత్తమ కళా శాల అవార్డును కైవసం చేసుకోవడం జరిగిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బం దిని, విద్యార్థులను ఆయన అభినం దించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈవూరి బ్రహ్మా రెడ్డి ఉన్నారు.