Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 02:02AM

కార్తీ ఆఫీసులపై ఐటీ దాడులు

  • వాసన్‌ ఐ కేర్‌ సంస్థపైనా! 
  • నేరుగా ఎదుర్కోలేకే: చిదంబరం 
చెన్నై, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీకి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గతంలో కార్తీ డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ ఆర్థిక అవకతవకలకు సంబంధించి.. చెన్నైలోని హ్యాడోస్‌ రోడ్డులోని కార్తీ నివాసం, గాంధీ రోడ్డులోని కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి చిదంబరం కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న వాసన్‌ ఐ కేర్‌ హాస్పిటల్‌ గ్రూప్‌ కార్యాలయాల్లో, కార్తీ సన్నిహితుల నివాసాల్లోనూ ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం. ఆగస్టులోనే ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ కేసుకు సంబంధించి కార్తీ చిదంబరానికి చెందిన ‘అడ్వాన్టేజ్‌ సా్ట్రటజిక్‌ కన్సల్టింగ్‌’ సంస్థలోని ఇద్దరు డైరెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి.. మే 2012లో అప్పటి రాజ్యసభ ప్రతిపక్ష నేత హోదాలో వున్న అరుణ్‌ జైట్లీ ఇదే కంపెనీకి సంబంధించి చిదంబరంపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో.. ‘అడ్వాన్టేజ్‌్‌’ సంస్థ ఎయిర్‌సెల్‌కు రూ. 26 లక్షలు చెల్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సంస్థలో కార్తీకి 94ు వాటా ఉందని బీజేపీ కూడా ఆరోపించిన నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. కాగా ఐటీ దాడులపై చిదంబరం ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుంటే నేరుగానే ఎదుర్కోవచ్చని.. ఇలా ఐటీ ముసుగులో దాడులు చేయించడం సరి కాదని వ్యాఖ్యానించారు.