Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 02:00AM

నేరుగా పీఎఫ్‌ ఉపసంహరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 1: భవిష్యనిధి చందాదారులు ఇకపై యాజమాన్య ధ్రువీకరణతో సంబంధం లేకుండా నేరుగా తమ సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. ఈ వెసులుబాటును మంగళవారం నుంచే అమలులోకి తెచ్చినట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కేంద్ర కమిషనర్‌ కె.కె.జలాన్‌ ప్రకటించారు. ఇప్పటి విధానం ప్రకారం చందాదారులు తమ దరఖాస్తులను ప్రస్తుత లేదా పూర్వ యాజమాన్యం ధ్రువీకరణతో సమర్పించడం తప్పనిసరి. అయితే, సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్‌) పొంది ఆధార్‌, బ్యాంకు ఖాతాసహా వ్యక్తిగత ధ్రువీకరణ నిబంధనలను పూర్తిచేసినవారు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు సమర్పించవచ్చు. ఇక యూఏఎన్‌ పొంది ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబర్‌ తదితరాలన్నీ ఈపీఎఫ్‌వోలో పొందు పరచిన వారంతా ఫామ్‌-19 యూఏఎన్‌, ఫామ్‌-10సి యూఏఎన్‌, ఫామ్‌-31 యూఏఎన్‌ ద్వారా చందా దారులు ఆయా కమిషనర్లకు వ్యక్తిగతంగా సొమ్ము ఉపసంహరణ దరఖాస్తులు సమర్పించవచ్చునని వివరించారు.