Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

ఒంగోలు నగరాభివృద్ధికి ప్రణాళికలు

కలెక్టర్‌ విజయకుమార్‌ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్‌: ఒంగోలు నగరంలో రూ 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ విజయకుమార్‌ అదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్ర వారం ఒంగోలు నగర పాలక సంస్థ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నగరసపాలక సంస్థ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఐదు ఆంతస్థు ల భవనాన్ని రూ.ఏడు కోట్లతో నిర్మిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ కార్యాలయాల కు ధీలుగా రాబోయే 20 ఏళ్ళకు సరి పోయే విధంగా నిర్మించడం జరుగు తుందని పేర్కొన్నారు. ఊరచెరువు ప్రాంతంలో కన్వెన్షన్‌ హాలు నిర్మించ డానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అదేశించారు. మూడు కోట్లతో నెల్లూరు బస్టాండులో కళా ప్రాంగణం, అంబేద్కర్‌ క్షేత్రాన్ని నిర్మించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నుంచి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అద్దంకి బస్టాం డు సెంటర్‌లోని పంజాబ్‌ బ్యాంకు స్థానంలో విలాస వంతమైన బడ్జెట్‌ హోటల్‌ నిర్మించేందుకు ప్రతిపాదన లు తయారు చేయాలని సూచించా రు. పాత మార్కెట్‌ మునిసిపల్‌ స్థలంలో మల్టీ ఫ్లెక్సీ ఽథియేటర్‌ నిర్మిం చడానికి ప్రతి పాదనలు రూపొందిం చాలని నగర పాలక సంస్థ అధికారు లను కలెక్టర్‌ అదేశించారు.
రాజధానికి ధీటుగా
ప్రకాశం భవన్‌ నిర్మాణం
జిల్లాకే తలమానికంగా రాజధానికి ధీటు గానూ తన ప్రకాశం భవనం నిర్మించడానికి ప్రభుత్వం రూ 105 కోట్లు మంజూరు చేయడం జరి గిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌, పాత రిమ్స్‌ స్థానంలో వంద అడుగుల ఎత్తులో ఇండియా గేట్‌ మోడల్‌ రెండు కాంప్లెక్స్‌లకు అనుసంధానం చేయడం జరుగుతుం దన్నారు. ఎనిమిది ఎకరాల సువిశాల మైన సమావేశపు హాలు, 60 ప్రభు త్వ శాఖల కార్యా లయాలు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటు న్నట్లు పేర్కొన్నారు. కొత్తపట్నం మండలంలోని ఆల్లూరు ప్రాంతంలో 15 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మా ణానికి పరిశీలించాలని కలెక్టర్‌ అదే శించారు. రంగారాయుడు చెరువు తూర్పువైపు రోడ్డును వంద అడుగుల రోడ్డుగా, దక్షిణం వైపు మంగమూరు రోడ్డును వంద అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్‌టిఆర్‌ సుజ ల స్రవంతి పథకాన్ని ఏర్పాటు చేసేం దుకు 15 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఒక్కొక్క ప్లాంటు రూ 3.60 లక్షలు ఉంటుందని, దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేయడం జరుగు తుందని చెప్పారు. ఒక్కొక్క కుటుం బానికి రూ.2లకే 20 లీటర్ల నీటిని అందించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఒంగోలు నగరం లో అన్నా క్యాంటిన్లను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు చెప్పారు. బస్టాండు ప్రాంతంలో ఒక టి, రిమ్స్‌ వైద్యశాల వద్ద మరోకటి ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ సందర్బం గా ఒంగోలు నగరంలో అమ లు చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలను ఫవర్‌ పాయింట్‌ ప్రజేంటషన్‌ ద్వారా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుకు వివరించారు. ఈ సందర్బంగా జనా ర్దన్‌రావు ఒంగోలు నగరంలో చేపట్టా ల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కొండపి ఎమ్మెల్యే డివిబి స్వామి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయలక్ష్మీ, ఒంగో లు ఆర్డీవో ఎంఎస్‌ మురళీ, ఒంగోలు తహసీల్దార్‌ మోడమంచు వెంకటేశ్వ ర్లుతో పాటు నగరపాలక సంస్థ అధి కారులు ఉన్నారు.