Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెంకటయ్య
పుల్లలచెరువు: మండలంలోని పలు పాఠశాలలను ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ యు. వెంకటయ్య పరిశీలించి పలు హాస్టళ్ళను తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా పుల్లలచెరువులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, హాస్టల్‌ను తనిఖీ చేసి , మురికిమళ్ళలోని ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను, గారపెంటలోని హాస్టల్‌, పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టళ్ళలోని మౌలిక వసతులను, రికార్డులను, భోజన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా 10వ తరగతి విద్యార్థులతో మాట మంచి కలిపి గత సంవత్సరంలో కన్నా ఎక్కువ మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా కె.జి.బి.వి. విద్యార్థులు, కాంపౌండు గోడ, నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, గారపెంటలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని ఉపాధ్యాయులు కోరగా వెంటనే ప్రతిపాదనలు పంపుతానని, నిధులు కూడా త్వరగా మంజూరు చేయిస్తానని తెలిపారు. ఆయన వెంట మండల విద్యా వనరుల అధికారి పి. ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, బయ న్న, అరుణ కుమారి ఉన్నారు.