Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:36AM

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు

చిన్నచింతకుంట: మండలంలో ఇకపై ఇ సుక అక్రమ రవాణాను కొనసాగిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని, ఆర్డీఓ అనుమతి ఉం టేనే అనుమతికి అవకాశం ఉంటుందని తహసీల్దార్‌ గంగాధర్‌, ఎస్సై రమేష్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో వారు ఇసుక అక్రమ రవాణా ని రోదానికి సంబంధించి ట్రాక్టర్‌ యజమానులు, వీఆర్వోలు, సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌, ఎస్సై మా ట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు మానవాళికి పెద్ద ముప్పు ఉందన్నారు. ప్రకృతి వనరులను నాశనం చేసే హక్కు ఎవరికీ లేద న్నారు. ఇసుక అక్రమ రవాణాలో రెవెన్యూ, పో లీసుల యంత్రంగాన్ని నిందించడం సరైందని కాదని, ఇది ట్రాక్టర్‌ యజమానులు గమనించాలన్నారు. ట్రాక్టర్‌ యజమానులు రెండు మూ డు రోజుల్లో వాహన నెంబర్లతో దానికి సంబంధించిన కాగితాలను సమర్పించాలన్నారు. మం డల కేంద్రంలో ఇసుక తరలింపు విషయంలో గ్రామ పంచాయతీ అనుమతితో పాటు సర్పం చ్‌ సంతకం ఉండాలన్నారు. మండలంలోని అ ల్లీపూర్‌ శివారులో ఇసుక అక్రమ రవాణా జో రుగా కొనసాగుతుందని, దాదాపు 20, 30 ట్రా క్టర్లు, లారీలతో తరలిస్తున్నారని, అడ్డుకునేందు కు చూసినా స్పందించలేదని ఆ గ్రామ సర్పం చ్‌ సీతమ్మ తహసీల్దార్‌ దృష్టికి తెచ్చారు. ఇ సుకను అక్రమంగా తరలిస్తున్నారని,ఇది గ్రామ శివారులో జరుగుతున్న దీన్ని అరికట్టాలని సీసీకుంట సర్పంచ్‌ భర్త దశరథ్‌ సూచించారు. కార్యక్రమంలో వీఆర్వోలు మరాఠిరాజు కృష్ణయ్య, శ్రీను, నాయకులు ప్రదీప్‌రెడ్డి, చాకలి కొండన్న, శ్రీను, సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.