Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:36AM

ఏపీఎంఎస్‌ ఈడీసీ ఎండీ రవి చంద్ర ఆధ్వర్యంలో రిమ్స్‌లోని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ పరిశీలన

కడప, రిమ్స్‌ : రిమ్స్‌లోని కడప సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ను ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ప్రొస్టక్చరస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ముద్దల రవి చంద్ర పరిశీలించారు. కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన శుక్రవారం రిమ్స్‌లోని సెంట్రల్‌ స్టోర్‌ను పరిశీలించారు. సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ ఇన్‌చార్జ్‌ సల్మత్‌ అక్కడి సమస్యలు సిబ్బంది మందుల కొరత వివిధ అంశాలపై చర్చించారు. రికార్డుల ఏర్పాటును పరిశీలించి ఆమెను ప్రశంసించారు. ఇదే తరహాలో రికార్డులను ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. స్టోర్‌లో శానిటేషన్‌ సమస్యను ఆయన దృష్టికి తీసుకు రాగా త్వరలోనే కాంట్రాక్టు పద్ధతిలో శానిటేషన్‌ విధానాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎండి ముద్దల రవి చంద్ర మాట్లాడుతూ ఈ సారి మెడిసిన్‌కు బడ్జెట్‌ బాగా పెరిగిందని, అదే విధంగా మందుల కొనుగోలు పెరగడంతో వాటి నిర్వహణకు నాణ్యత ప్రమాణాలను కాపాడేందుకు అదనపు భవనాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, వైజాక్‌, గుంటూరు జిల్లాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, కడపలో నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, ఏపీఎం ఎస్‌ఐడీసీ డీఈ శివన్న, ఏఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.