Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:36AM

అంగన్‌వాడీల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు

ఎర్రగొండపాలెం : అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన జీతాలపెంపుపై అసెంబ్లీలో ప్రశ్నించి చర్చకు తెస్తానని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెం ఐసీడీయస్‌ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యేపాలపర్తి డేవిడ్‌ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు సీడీపీవో వి.వెంకట లక్షమ్మ అధ్యక్షత వహించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం పేదలు అధికంగా ఉన్నారని వారి పిల్లలకు ఐసీడీయస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపీణీ ఎంతో అవసరమన్నారు. ఎర్రగొండపాలెం ఐసీడీయస్‌ కార్యాలయంనకు మీటింగ్‌ హాలుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం ప్రాజెక్టు ఉత్మమ ప్రాజెక్టుగా ఎంపిక కావాలన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ విజయభాష్కర్‌, జడ్పీటీసీ సభ్యుడు యం.మంత్రునాయక్‌, డాక్టర్‌ కిృష్ణనాయక్‌, సూపర్‌ వైజర్లు జి.సుబ్బమ్మ, జ్ఞాన సలోమి, యం.కోటమ్మ,యం.కోటేశ్వరి, కె.వి.సుబ్బమ్మ,ఎ.పద్మజ, వెంకటేశ్వరమ్మ, కవితాశ్రీ, యన్‌.వి.వెంకటరత్నం సీనియర్‌ సహయకులు టి.చెంచుకుమారి, అంగన్‌ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు సన్మానం
నరసాయపాలెం అంగన్‌ వాడీ కార్యకర్త రమాదేవి ఇటీవల కలెక్టరు నుంచి ఉత్తమ ప్రశంశా పత్రం పొందారు. గారపెంట అంగన్‌ వాడికార్యకర్త పి.పిన్నమ్మ ప్రాజెక్టు లెవెల్‌లో ఉత్తమ కార్యకర్తగా ఎన్నికఅయ్యారు. శుక్రవారం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, ఎంపీపీ విజయభాష్కర్‌, జడ్పీటీసీ సభ్యుడు మంత్రునాయక్‌, సీడీపీఓ వెంకట లక్షమ్మ, సూపర్‌వైజర్లు దుశ్శాలవాలతో ఘనంగా సన్మానించారు.