Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 00:39AM

ఢిల్లీలో ఏం చేస్తారో: జాక్‌ కలిస్‌

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌ పరాజయం దక్షిణాఫ్రికాను తీవ్రంగా బాధించి ఉంటుంది. ఆ నిరుత్సాహం నుంచి సఫారీలు కోలుకున్నారనే భావిస్తున్నా. అత్యుత్తమ ప్రదర్శన కనబరచినా ఓడడం ఏ జట్టుకైనా బాధను కలిగిస్తుంది. నాగ్‌పూర్‌ టెస్ట్‌లో ఆమ్లాసేన గెలవాల్సింది. కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది. ఈ సిరీ్‌సలో మెరుగ్గా ఆడకుండా స్వదేశానికి వెళ్లడానికి సిగ్గేస్తోందని దక్షిణాఫ్రికా ఆటగాడు ఒకరు నాతో అన్నాడు. ఇక ఢిల్లీలో సఫారీలు ఏం చేస్తారో చూడాలి. పర్యాటక జట్టులో ఒకటి, రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ టూర్‌లో యువ పేసర్‌ రబాడ అంచనాలకు మించి రాణించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అతను అత్యుత్తమంగా బౌలింగ్‌ చేశా డు. అయితే చివరి టెస్ట్‌లో రబాడకు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. యువ స్పిన్నర్‌ డేన్‌ పీట్‌ వైవిధ్యమైన బంతులు వేయగలడు. కాబట్టి, అతనికి ఓ చాన్స్‌ ఇచ్చి చూడాలి. మరోవైపు ఢిల్లీ టెస్ట్‌లో ఆతిథ్య భారత అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చివరి టెస్ట్‌లో కోహ్లీసేన ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేయకపోతేనే ఆశ్చర్య పోవాలి.                                             - హాక్‌ఐ/చివాక్‌ స్పోర్ట్స్‌