Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 23:36PM

రిలయన్స్‌ చౌర్యం నిజమే

  • రూ.11,055 కోట్లు నష్టపోయిన ఓఎన్‌జిసి
  • నిగ్గు తేల్చిన నివేది
న్యూఢిల్లీ: ఏపి తీరంలోని కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ బండారం మరోసారి బయటపడింది. పక్కనే ఉన్న ఓఎన్‌జిసి క్షేత్ర సరిహద్దుల్లో బావులు తవ్వడం ద్వారా కేజీ బేసిన్‌లోని తన డి6 క్షేత్రానికి గ్యాస్‌ పారించుకుందని అమెరికాకు చెందిన డిగొలియర్‌ అండ్‌ మెక్‌నాటన్‌ (డి అండ్‌ ఎం) అనే సంస్థ తేల్చింది. ఈ సంస్థ తన తుది నివేదికను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రో కార్బన్స్‌ (డిజిహెచ్‌)కు సమర్పించింది. ఏప్రిల్‌ 2009 నుంచి రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ఇలా రూ.11,055 కోట్ల విలువైన 8.981 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బిసిఎం) గ్యాస్‌ ఔన్‌జిసి క్షేత్రం నుంచి తోడేసిందని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై 2013లోనే ఔన్‌సిజి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సూచనతో రెండు సంస్థలు ఈ విషయాన్ని డి అండ్‌ ఎంకు నివేదించాయి. డి అండ్‌ ఎం కూడా రిలయన్స్‌ నిర్వాకం నిజమని తేల్చడంతో ఇపుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి వ్యక్తం అవుతోంది. డి అండ్‌ ఎం కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తే, ఔన్‌జిసికి ఆరు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. తుది నివేదిక అందడంతో ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.