Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 23:27PM

లక్ష్యాన్ని మించిన సింగరేణి

కార్మికులను అభినందించిన సిఎండి ఎన్‌ శ్రీధర్‌
 
ఆంధ్రజ్యోతి సింగరేణి ప్రతినిధి: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్‌ మరో రికార్డు నెలకొల్పింది. నవంబర్‌, 2015తో ముగిసిన ఎనిమిది నెలల్లో 3.75 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఇది నిర్ణీత లక్ష్యానికంటే 29 లక్షల టన్నులు ఎక్కువ. విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా విషయంలో సైతం సింగరేణి సంస్థ రికార్డు సృష్టించింది. ముందు నిర్ణయించిన లక్ష్యం ప్రకారం ఈ ఎనిమిది నెలల్లో థర్మల్‌ విద్యుత కేంద్రాలకు 181 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలి. 216 లక్షల టన్నులు సరఫరా చేసి మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఇందుకు సింగరేణి కాలరీస్‌ సిఎండి ఎన్‌ శ్రీధర్‌ కార్మికులను అభినందించారు.
 
రామగుండం ఎన్‌టిపిసిలో పెరిగిన విద్యుత ఉత్పత్తి
బొగ్గు సరఫరా సమృద్ధిగా ఉండడంతో రామగుండంలోని ఎన్‌టిపిసి విద్యుత ప్లాంట్‌లో గరిష్ఠ స్థాయిలో విద్యుత ఉత్పత్తి జరుగుతోంది. గత ఎనిమిది నెలల్లో ఈ ప్లాంట్‌ 86.20 శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో పని చేస్తూ 13,123.7 మిలియన్‌ యూనిట్ల విద్యుత ఉత్పత్తి సాధించింది.