Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 19:14PM

అడ్వాణి భార్యకు అస్వస్థత

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బీజేపీ అగ్రనేత ఎల్.కె.అడ్వాణి భార్య కమలా అడ్వాణి మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో పాటు మూత్ర సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. కమలా అడ్వాణి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.