Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 15:03PM

బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతాం: డేవిడ్

హైదరాబాద్‌: బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ఫెస్టివల్ నిర్వాహకుడు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా బీఫ్ ఫెస్టివల్ గురించి రగడ జరుగుతోంది. జంతుప్రేమికులు, పలు పార్టీల నాయకులు ఈ పండుగను వ్యతిరేకించారు. అయితే కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన డేవిడ్..ఎన్ని అడ్డంకులు ఎదురైనా..ఎవరు వ్యతిరేకించినా బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామన్నారు. బీఫ్‌ ఫెస్టివల్‌కు బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈనెల 5న రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 7న నెక్లస్‌రోడ్డులో 5కే రన్ ప్రారంభిస్తామని బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకుడు డేవిడ్‌ చెప్పారు.