desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:47AM

మా ఆయన ప్రోత్సాహంతోనే డిజైనర్‌గా రాణిస్తున్నా ...


తాండూరు : ఒకటో తరతగతి నుంచి పదో తరగతి వరకు మేమిద్దరం క్లాస్‌మెట్స్‌. ఇద్దరం ప్రేమించుకున్నప్పటికీ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. హైదరాబాదీ డిజైనర్‌గా రాణించి గుర్తింపు పొందడంలో భర్త ప్రోత్సాహం చాలా ఉందని డిజైనర్‌ సంధ్య అన్నారు. తాండూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తన భర్త మల్కోడ్‌ నరేష్‌ గురించి ఆమె ఆంధ్రజ్యోతితో ‘‘శ్రీవారి ముచ్చట్లను’’ పంచుకుంది... తెలంగాణ రాజకీయాల్లో నరేష్‌ మరింత బలపడాలన్న ప్రయత్నంలో ఉన్నా. నేను వేసిన డిజైన్‌లకు ప్రచారం కల్పిస్తూ ప్రోత్సహించడం మరువలేను. హైదరాబాద్‌తోపాటు ఇతర దేశాలకు పంపించడంలో ఆయన కృషి చాలా ఉంది. మా కుటుంబం రాజకీయ నేపథ్యంలో ఉంది. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ మా ఆయన చలాకీగా ఉంటారు.
ఆంద్రజ్యోతి : మీ భర్త పైలెట్‌గా ఉండటం ఇష్టమా, పొలిటికల్‌గా రాణించడం ఇష్టమా.
సంధ్య : పొలిటికల్‌గా రాణించడమే ఇష్టం.
ఆంధ్రజ్యోతి : మీ ఆయనలో నచ్చని అంశాలేమిటీ?
సంధ్య : ఏమీ లేవు.
ఆంధ్రజ్యోతి : మీ ఆయన విద్యబ్యాసం గురించి...
సంధ్య : నేను, ఆయన కలిసి పదో తరగతి వరకు అరణ్య స్కూల్‌లో చదువుకున్నాం. నేనే ఫస్ట్‌ ఉండేదాన్ని.
ఆంధ్రజ్యోతి : మీరు ప్రముఖ డిజైనర్లలో ఒకరు కదా? మీ ఆయన ప్రోత్సాహం ఎలా ఉంది?
సంధ్య : నాకు జ్యూవెలరీ డిజైన్‌ అంటే ఆసక్తి. నా అభిరుచి తెలుసుకున్న మా ఆయన నన్నెప్పుడూ ప్రోత్సహించేవారు. ఇప్పుడు కూడా డిజైనర్‌గా రాణించేందుకు ఆయన ప్రోత్సాహమే కారణం. నేను వేసిన డిజైన్లను మా ఆయన ఫ్రెండ్‌ సర్కిల్‌ ద్వారా అమెరికా, సింగపూర్‌, లండన్‌ దేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేయడంలో సహకరిస్తారు.
ఆంధ్రజ్యోతి : నరేష్‌ అప్పటికీ ఇప్పటికీ ఎలా ఉన్నారు?
సంధ్య : ఆయన ఎప్పుడూ ఫ్రెండ్లీగా నవ్వుతూ ఉంటారు.
ఆంధ్రజ్యోతి : స్కూల్‌లో చదివేటప్పుడైనా, మీ మ్యారేజీ తర్వాతైనా గొడవపడ్డారా?
సంధ్య : అలాంటివేమీ లేవు. విమర్శలనైనా సంతోషంగా స్వీకరించే గుణం ఆయనది.
ఆంధ్రజ్యోతి : నరేష్‌ రాజకీయాలపై మీ కామెంట్‌?
సంధ్య : కర్ణాటక రాజకీయాలకంటే తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగాలని నరేష్‌కు సూచించా. కుటుంబమంతా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ మా ఆయన టీడీపీలో చేరారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు ఫ్యూచర్‌ లేదని భావించి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడం ఆయన సొంత నిర్ణయం.
ఆంధ్రజ్యోతి : కుటుంబంతో ఎలా గడుపుతారు?
సంధ్య : పిల్లలతో ఎక్కువగా గడుపుతారు. ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే నాతో పాటు హాజరవుతారు.
ఆంధ్రజ్యోతి : మీ మ్యారేజీ గురించి చెప్తారా.?
సంధ్య : మేము ప్రేమించుకున్నాం కానీ మాది పెద్దలు అంగీకారంతో 1995లో పెళ్లి జరిగింది.
ఆంధ్రజ్యోతి : మీ ఆయన గురించి...
సంధ్య : మా మావయ్య మాజీ మంత్రి, స్వర్గీయ చంద్రశేఖర్‌ మాదిరిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలని నా కోరిక. అందుకు నా ప్రోత్సాహం ఉంటుంది. నరేష్‌ జనం మనిషి. అందరితో హ్యాపీగా మాట్లాడతారు.
ఆంధ్రజ్యోతి : మీ ఆయనలో ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా?
సంధ్య : మా ఆయన 1991 నుంచి 94 వరకు అమెరికాలో పైలెట్‌గా శిక్షణ పొందారు. 1998-2001 వరకు పనిచేశారు. ఇప్పటికీ తాను చేసిన పైలెట్‌గా వ్యవహరించిన విషయాలను గుర్తు చేస్తుంటారు.