desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:47AM

పంట రుణ మాఫీ రూ.1032,60 కోట్లు

2,10,252 మంది రైతులు అర్హులుగా గుర్తింపు
తుది జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తాం
రుణమాఫీపై 15న ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌
మాఫీతో సంబంధం లేకుండా రీషెడ్యూల్‌
ఖరీఫ్‌ లక్ష్యాన్ని అధిగమించాలి

డీసీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌) 
జిల్లాలో రూ.1032.60కోట్ల పంటరుణాలను మాఫీ చేసేందుకు 2,10,252 మంది రైతులను అర్హులుగా గుర్తించామని జిల్లా కలెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రైతు రుణమాఫీపై ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ (బ్యాంకర్ల) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు రుణాల మాఫీపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం జేఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించామని, గ్రామాల్లో ఇందుకు సంబంధించి అర్హులైన రైతులను గుర్తించి తుదిజాబితాను రూపొందించినట్టు తెలిపారు. రైతు రుణమాఫీ కింద జిల్లాలోని 37 మండలాల్లోని వివిధ 400 బ్యాంకుల బ్రాంచ్‌లలో రుణమాఫీకి సంబంధించి జేఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఇందుకు అధికారులంతా సహకరించారన్నారు. ఈ రుణమాఫీ తుది జాబితాను డీసీసీలో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు వెల్లడించారు. ఈనెల 15న నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీని ఏ విధంగా చేయాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఖరీఫ్‌లో రుణమాఫీతో సంబంధం లేకుండా రీషెడ్యూల్‌ చేయాలని సూచించారు. రైతులకు కొత్త రుణాలతో పాటు రీషెడ్యూల్‌ను ఈ నెల 15 నుంచి 25లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున రైతులను వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పంట రుణాలు, రీషెడ్యూల్‌ రుణాల వివరాలను కలెక్టరేట్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఖరీఫ్‌లో రూ.442కోట్ల పంట రుణాలకు గానూ కేవలం రూ.122కోట్లు రుణాలను అందించడం జరిగిందని తెలిపారు. మిగతా రుణాలను త్వరితగతిన అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే అనుమతి లభించిందని కలెక్టర్‌ వెల్లడించారు. ఈనెల 25లోగా రీషెడ్యూల్‌ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. పంట రుణాలకు సంబంధించి తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో వచ్చే సోమవారం సమావేశాలు నిర్వహించి రుణాలపై నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పంట రుణాల మంజూరీలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో రైతులకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆయా బ్యాంకులే బాఽధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎం.వి.రెడ్డి, డీఆర్వో సూర్యారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ సుబ్బారావు, జేడీఏ విజయ్‌కుమార్‌, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్‌ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
్డత=్ఛ/