Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:46AM

ఆధార్‌తో తగ్గిన సబ్సిడీల భారం


 యుఐడిఎఐ మాజీ చీఫ్‌ నందన్‌ నీలేకని
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆధార్‌ అనుసంధానంతో సబ్సిడీల భారం తగ్గిందని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడిఎఐ) మాజీ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు దాదాపు 30,000 కోట్ల రూపాయలుండగా అందులో 40 శాతం వరకు అనర్హుల చేతిలోకి వెళ్లేవని ఆధార్‌ ద్వారా వీటికి చెక్‌ చెప్పే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఆయన సెంటర్‌ ఫర్‌ ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ (సిడిఒ)లో తమిళనాడు గవర్నర్‌ కె రోశయ్య చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన వి కృష్ణమూర్తి అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ను అందుకున్నారు. అంతకు ముందు ఆయన ట్రాన్స్‌ఫార్మింగ్‌ గవర్నెన్స్‌ త్రూ టెక్నాలజీ అనే అంశంపై మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలోకి తీసుకువెళ్లేందుకు టెక్నాలజీ ఎంతగానో దోహదపడిందని అన్నారు. ఆధార్‌తో ప్రజలందరికీ ఒక గుర్తింపు లభించినట్లయిందని ఆయన తెలిపారు. ఆధార్‌లో పొందుపరిచిన వివరాలన్నీ సురక్షితంగా ఉంటాయని ఇవి ఎవరి చేతుల్లోకి చేరే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధార్‌తో నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించటంతో సబ్సిడీ అవకతవకలకు చెక్‌ పెట్టగలిగామని అన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 67 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాలని భావిస్తోందని అందులోభాగంగానే ఉత్తర ప్రదేశ్‌, జార్ఖండ్‌ తదితర రాషా్ట్రల్లో నమోదు ప్రక్రియను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ రాషా్ట్రల్లో ఆధార్‌ ప్రక్రియ పూర్తయితే ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని నీలేకని వెల్లడించారు. ఛిశ్రీ1. స్ప)ఞఖ్ఠి