Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:45AM

అంత తొందరెందుకు?


న్యూఢిల్లీ: కుమార్‌ మంగళం బిర్లా సహా ఇతరులపై చార్జిషీటు దాఖలు చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసు మూసేయడానికి ఎందుకంత తొందరపడుతున్నారని సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఈ కేసు మూసివేతకు సంబంఽధించిన నివేదికను సమర్పించేందుకు తొందరెందుకని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్‌ ప్రశాంత్‌ కేసు విచారణాధికారిని ప్రశ్నించారు. బొగ్గు బ్లాకుల కేటాయించాలని కోరుతూ హిండాల్కో దరఖాస్తు సమర్పించిన స్ర్కీనింగ్‌ కమిటీ సమావేశానికి సంబంధించిన ఒరిజినల్‌ మినిట్స్‌ గల్లంతయినట్టు విచారణాధికారి ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మినిట్స్‌ కనిపించకుండాపోవడానికి సంబంధించిన ఏదైనా స్టేట్‌మెంట్‌ ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, విచారణాధికారి చేతులెత్తేశారు. దీంతో పై అధికారిని పిలవాల్సిందిగా న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా కేసు డైరీ తీసుకురాకపోవడం పట్ల న్యాయమూర్తి సిబిఐకి అక్షింతలు వేశారు. ‘‘ఏ ప్రాతిపదికన కేసు మూసివేయాలని నిర్ణయించారు? ఇందుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిపారు? మీపై అధికారి ఏం చేస్తున్నారు? తక్షణమే పోలీస్‌ ఫైల్‌ను సమర్పించడంతోపాటు మీ ఉన్నతాధికారిని హాజరుపరచండి’’... అని జడ్జి విచారణాఽధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అస్పష్టంగా ఉన్న గజిబిజి డాక్యుమెంట్లను తమ ముందు కుమ్మరించడంపై సైతం న్యాయవాది సిబిఐకి చీవాట్లు పెట్టారు. సిబిఐ సమర్పించిన డాక్యుమెంట్లలో కొన్ని చదివేందుకు సైతం వీలుగా లేవని న్యాయమూర్తి అస హనం వ్యక్తం చేశారు. హిండాల్కోకు కేటాయింపుల్లో రూల్‌ ఆఫ్‌ లా పాటించారా? ఇందులో అవకతవకలేమైనా జరిగాయా? ఒకవేళ జరిగితే వాటిలో క్రిమినల్‌ స్వభావం ఉందా? అన్న విషయాలపై స్పష్టత ఇవ్వాల ని ప్రత్యేక కోర్టు గతంలో సిబిఐని ప్రశ్నించింది. హిండాల్కోకు బొగ్గు గనులు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ గతేడాది అక్టోబర్‌లో కుమార్‌మంగళం బిర్లా, పిసి పరాఖ్‌పై చార్జిషీటు దాఖలు చేసింది. అయితే తమ విచారణలో ఎటువంటి క్విడ్‌ప్రోకో జరగలేదని పేర్కొన్న సిబిఐ వీరిపై కేసు మూసివేస్తున్నట్లు గత ఆగస్టు 28న కోర్టుకు తెలిపింది.
కంపెనీల విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం
ప్రభుత్వం నుంచి బొగ్గు బ్లాకులు పొందిన కంపెనీల విజ్ఞప్తులను వినేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. కోల్‌ బ్లాకుల కేటాయింపు అక్రమమని సుప్రీం పేర్కొన్న కేసులో తమ వాదనలను తిరిగి వినాలన్న విద్యుత్‌ఉద్పాదక కంపెనీల విజ్ఞాపనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోధా నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించింది. ్ఙతథి/