Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:43AM

6 నెలల్లో విద్యుత్‌ కొరత త గ్గుతుంది


ఐటి మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : వచ్చే ఆరు నెలల కాలంలో తెలంగాణలో విద్యుత్‌ కొరతను తగ్గించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. ఇటీవలే వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కోసం నిర్వహించిన వేలానికి పలు కంపెనీల నుంచి విశేష స్పందన లభించిందని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్‌ లభ్యత మరింతగా పెరుగుతుందన్నారు. కర్ణాటక నుంచి కూడా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ గ్రిడ్‌ లేకపోవడం వల్ల విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతున్నామన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అపార బొగ్గు నిల్వలు, నీటి వనరులు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు విద్యుత్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయకపోవడం వల్లనే విద్యుత్‌ కొరత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చే సేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఫలితంగా 2018 నాటికల్లా తెలంగాణలో మిగులు విద్యుత్‌కు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మేనే జ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఎ) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారంనాడిక్కడి ఫ్యాప్సీ భవన్‌లో ‘తెలంగాణ : రోడ్‌ ఎహెడ్‌’ పేరుతో నిర్వహించిన ఉపన్యాస పరంపర కార్యక్రమంలో కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా చిన్న, భారీ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో 75 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంటే కేవలం జిహెచ్‌ఎంసి పరిధి మాత్రమే కాదని, హైదరాబాద్‌లో ఐదు జిల్లాల అభివృద్ధి కూడా కలిసి ఉందని తెలిపారు. ప్రాజెక్టుల అభివృద్ధికి అనుమతులు పొందడంలో చాలా జాప్యం జరుగుతోందని, దీనిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఎ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జె నృపేందర్‌ రావు సూచించారు. తెలంగాణలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కొరత ఎక్కుగా ఉందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకున్న ప్రత్యేక సంస్కృతికి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రముఖ పాత్రికేయులు కింగ్‌శుక్‌ నాగ్‌ అన్నారు.