Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:42AM

గ్యాస్‌ ధర అనుకూలంగా ఉంటేనే పెట్టుబడులు



 నికో రిసోర్సెస్‌
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తయ్యే సహజ వాయువుకు ప్రభుత్వం సముచిత ధర ప్రకటిస్తేనే పెట్టుబడులతో ముం దుకెళ్తామని రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌(ఆర్‌ఐఎ ల్‌) భాగస్వామి నికో రిసోర్సెస్‌ స్పష్టం చేసింది. గ్యాస్‌ ధరలు తమకు అనుకూలంగా ఉంటే కెజి-డి6 క్షేత్రాల్లో కొత్తగా కనుగొన్న గ్యాస్‌ నిక్షేపాల అభివృద్ధి కోసం ఆర్‌ఐఎల్‌ గతంలో ప్రకటించిన 1000 కోట్ల డాలర్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంటామని గురువారం నాడు జరిగిన కంపెనీ సర్వసభ్య సమావేశంలో నికో తెలిపింది. కృష్ణా గోదావరి బేసిన్‌లోని కెజి-డి6, ఒడిషాలోని ఎన్‌ఇసి-25 క్షేత్రాల్లో ఆర్‌ఐఎల్‌కు గ్యాస్‌ నిక్షేపాలున్నాయి. భాగస్వామి కంపెనీలైన బిపి, నికోతో వాటిని నిర్వహిస్తుంది. గ్యాస్‌ ధరల్లో అనుకూలతలను బట్టి కెజి-డి6 క్షేత్రాల్లో ఆర్‌-సిరీస్‌, శాటిలైట్‌ డిస్కవరీల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నికో పేర్కొంది. కొత్తగా కనుగొన్న క్షేత్రాల్లో పాత ధరలకే ఉత్పత్తి కార్యకలాపాలు అసాధ్యమని పేర్కొంది. ధరలు పెంపు అమలును ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో నిరాశపూరిత వాతావరణం నెలకొందని బిపి ఇండియా అధినేత శశి ముకుందన్‌ గురువారం నాడు వెల్లడించారు. పెట్టుబడులు వెనక్కువెళ్లడంతో పాటు, ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సహజ వాయువు కోసం రంగరాజన్‌ కమిటీ సూచించిన ఫార్ములాను ఎన్డీఎ ప్రభుత్వం తిరస్కరించి, కొత్త ధరలను నిర్ణయించాల్సిందిగా నలుగురు సెక్రటరీలతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఒక ఎంఎంబిటియు గ్యాస్‌ ధర 4.2 డాలర్లుగా అమలైంది. ఆ తర్వాత నుంచి ఒక్క ఎంఎంబిటియుకు 8.4 డాలర్లు చెల్లించాలని రంగరాజన్‌ కమిటీ సూచించింది.