Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:37AM

రూ.2లక్షల కోట్ల ప్రాజెక్టులకు మోక్షం


ఈ ఏడాదిలో ప్రారంభిస్తామన్న గడ్కరీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తామని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. హైవేలను నిర్మించడం తేలికే కాని, వాటికి పర్యావరణ అనుమతులు పొందడం చాలా కష్టంగా మారిందని ఇటువం టి పరిస్థితుల్లో నియంత్రణాపరమైన ఆటంకాలను తొలగించి ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల విలువైన హైవే ప్రాజెక్టులను ప్రారంభించామని, ఈ ఏడాది సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ఆయన చె ప్పారు. భారతీయ ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్‌) వార్షిక ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న లక్ష కిలోమీటర్ల హైవేలను విస్తరించడంతో సహా మరో 2 లక్షల కిలోమీటర్ల రోడ్లను పిపిపి మోడల్‌లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం కొలువు తీరాక అనుమతులను త్వరితగతిన మంజూ రు చేస్తున్నామని, అవినీతిని ఏరిపారేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, ఒకవేళ అవసరం అనుకుంటే టోల్‌ ఆదాయాలను సెక్యూరిటీగా చూపి నిధులు సమీకరిస్తామని, దీంతో పాటు 10వేల కోట్ల రూపాయల విలువైన ఇన్‌ఫ్రా బాండ్ల విక్రయంతో నిధులు సమీకరిస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్‌నాటికి 350 ఎలకా్ట్రనిక్‌ టోల్‌ ప్లాజాలను ప్రారంభించడం, డ్రైవర్లకు, ప్రయాణికులకు ప్రతి 50 కిలోమీటర్లకు విశ్రాంతి గదులు నిర్మించడం చేపడుతున్నామని, ఇందుకోసం బిడ్లను ఆహ్వానించామని, ఇలా హైవే విభాగంలో అనేక కీలక మార్పులు, సంస్కరణలు తీసుకవచ్చామని తెలిపారు. నూతన మోటారు వాహనాల చట్టం ముసాయిదా వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందవచ్చని, దీనిపై సూచనలు సలహాల కోసం శనివారం నుంచి రవాణా శాఖ వెబ్‌సైట్లో ఉంచుతామని గడ్కరీ చెప్పారు. యుఎస్‌, జపాన్‌, యుకె సహా ఆరు దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ నిబంధనలను పరిశీలించి ఈ ముసాయిదా తయారు చేసినట్లు తెలిపారు. ముడిచమురు దిగుమతుల బిల్లు 6 లక్షల కోట్ల రూపాయల కు చేరిందని, దీన్ని తగ్గించేందుకు ఇథనాల్‌ ఉపయోగించే ఇంజన్లను తయారు చేయాలని, ప్రోత్సహించాలని సియామ్‌ను కోరారు. అయితే ప్రస్తుతం దేశంలో చాలినంత ఇథనాల్‌ అందుబాటులో లేదని సియామ్‌ ప్రతినిధులు తెలిపారు. జల రవాణాను ప్రోత్సహించడంపై ప్రభుత్వం శ్రద్ధగా ఉందని, ఇందులోభాగంగా సీ ప్లేన్లు ప్రవేశపెట్టడం, గంగపై ఎయిర్‌పోర్ట్‌ లాంటి టెర్మిన ళ్లను నిర్మించడం...తదితర కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు గడ్కరీ చెప్పారు. నౌకా నిర్మాణ నూతన పాలసీని త్వరలో ప్రవేశపెడతామని, కోచి నుంచి అండమాన్‌ దీవులతో సహా వివిధ ప్రాంతాల మధ్య క్రూయిజ్‌ షిప్పింగ్‌ను ప్రోత్సహిస్తామని గడ్కరీ వెల్లడించారు.