desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:37AM

హెచ్‌ఐఎల్‌ నుంచి రైనోస్‌ అవుట్‌

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ముంబై మెగ్నీషియన్స్‌ తొలి షాకిస్తే.. ఆరంభ అంచె పోటీల చాంపియన్‌ రాంచీ రైనోస్‌ కూడా హెచ్‌ఐఎల్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఆ ఫ్రాంచైజీ పేర్కొంది. ఫ్రాంచైజీ ఫీజు విషయంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ)తో ఏర్పడిన విభేదాలే రాంచీ రైనోస్‌ నిష్క్రమణకు కారణమని తెలుస్తోంది. ముంబై, రాంచీ టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ డెక్కన్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి పుణె ఫ్రాంచైజీని హెచ్‌ఐ అప్పగించింది.