Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:37AM

సెమీస్‌లో ప్రణయ్‌

పాలెమ్‌బేంగ్‌ (ఇండోనేషియా): భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రీలో సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ప్రణయ్‌ 21-13, 21-19తో స్థానిక ఆటగాడు సుబగ్జను ఓడించాడు. 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన ప్రణయ్‌, రెండో గేమ్‌ ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో కాస్తంత కష్టపడాల్సొచ్చింది. అయుతే మరో క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్‌ 15-21, 16-21తో తొమ్మిదో సీడ్‌ డారెన్‌ లూయీస్‌ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.