desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:36AM

రియో ఒలింపిక్స్‌లో పేస్‌తో బోపన్న!

బెంగళూరు: రియో ఒలింపిక్స్‌ (2016)లో భారత వెటరన్‌ డబుల్స్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌తో రోహన్‌ బోపన్న జతకట్టే అవకాశం ఉంది. డేవిస్‌ కప్‌ సందర్భంగా ఈ అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. బోపన్న ప్రతిపాదనలకు పేస్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కుదిరితే.. వచ్చే ఏడాది నుంచే పేస్‌తో జత కడతానని బోపన్న అన్నాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా పేస్‌తో విభేదాలు సమసిపోయాయని బోపన్న తెలిపాడు. ‘పేస్‌ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. అతనో గొప్ప డబుల్స్‌ ఆటగాడు. దేశం కోసం ఆడడానికి అతనెప్పుడూ ముందుంటాడు. అందుకే డేవిస్‌ కప్‌లో అతనితో జతకట్టా. అతనితో ఆడడం గొప్ప గౌరవమ’ని బోపన్న తెలిపాడు.