Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:35AM

సీఎల్‌ టీ-20 టిక్కెట్ల అమ్మకాలు షురూ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిఽది): చాంపియన్స్‌లీగ్‌ టీ20 చాంపియన్‌షిప్‌ టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు నగరంలోని పలు మొబైల్‌ స్టోర్స్‌లో కూడా ఈ టిక్కెట్లను విక్రయిస్తున్నారు. హిమాయత్‌ నగర్‌, అమీర్‌ పేట్‌, ఎమ్‌జీ రోడ్‌ (పారడైజ్‌), హైదర్‌నగర్‌లోని మొబైల్‌ స్టోర్స్‌లో సీఎల్‌ టీ-20 టిక్కెట్లు లభ్యమవుతాయి. టిక్కెట్ల కనీస ధరను 100 రూపాయలుగా నిర్ణయించారు.